ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బోర్‌వెల్‌లో శిశువును ప్లాస్టిక్‌ బాటిల్‌ కాపాడింది!

ABN, Publish Date - Dec 14 , 2023 | 05:21 AM

తీవ్రమైన చలిలో 20 అడుగుల లోతున బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయిన ఓ శిశువు ప్రాణాలను కాపాడటంలో ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ దోహదం చేసింది. ఒడిసాలోని సంబల్‌పూర్‌ జిల్లా లరిపలిలో మంగళవారం రాత్రి బోర్‌వెల్‌లో శిశువు పడిపోయింది. అధికారులు ఐదు గంటలపాటు

భువనేశ్వర్‌, డిసెంబరు 13: తీవ్రమైన చలిలో 20 అడుగుల లోతున బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయిన ఓ శిశువు ప్రాణాలను కాపాడటంలో ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ దోహదం చేసింది. ఒడిసాలోని సంబల్‌పూర్‌ జిల్లా లరిపలిలో మంగళవారం రాత్రి బోర్‌వెల్‌లో శిశువు పడిపోయింది. అధికారులు ఐదు గంటలపాటు శ్రమించి ఆ ఆడ శిశువును కాపాడారు. చలికాలం కావడంతో మంగళవారం రాత్రి అక్కడ ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది. ఒకానొక సమయంలో చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే, సహాయ చర్యలు కొనసాగించారు. ఎవరో బోర్‌వెల్‌లో పడేసిన మెత్తటి ప్లాస్టిక్‌ బాటిల్‌ బోరులో అడ్డుగా ఉండటం, శిశువు అక్కడే ఆగడంతో చిన్నారికి పెద్దగా గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. బోర్‌వెల్‌పైపును కోసే విషయంలోనూ చాలా అప్రమత్తంగా వ్యవహరించామని, చిన్నారి తట్టుకోలేనంత వేడి ఉత్పత్తి అవుతుందనే గ్యాస్‌కటర్‌ను ఉపయోగించలేదని తెలిపారు. చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని, శరీరంపై చాలా స్వల్ప గాయాలున్నాయని చెప్పారు.

Updated Date - Dec 14 , 2023 | 06:42 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising