ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasthan Congress infighting: అల్టిమేటం గడువుపై తగ్గేదేలేదన్న సచిన్ పైలట్

ABN, First Publish Date - 2023-05-31T19:16:03+05:30

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలెట్ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు సమసిపోలేదనే సంకేతాలు మరోసారి బయటకు వచ్చాయి. అవినీతి కేసులపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని గెహ్లాట్ పునరుద్ఘాటించారు. తాను ఇప్పటికే అల్టిమేటం ఇచ్చానని, ఇవాళే చివరి రోజని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలెట్ (Sachin Pilot) మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు సమసిపోలేదనే సంకేతాలు మరోసారి బయటకు వచ్చాయి. అవినీతి కేసులపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని సచిన్ పైలెట్ పునరుద్ఘాటించారు. తాను ఇప్పటికే అల్టిమేటం ఇచ్చానని, ఇవాళే చివరి రోజనీ, ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణపై తాను నిర్ణయం తీసుకుంటానని బుధవారంనాడు రాజస్థాన్‌లోని టోంక్‌లో సచిన్ పైలట్ తెలిపారు. ఢిల్లీలో గెహ్లాట్, పైలట్‌తో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సోమవారం సమావేశం కావడం, ఇద్దరూ కలిసికట్టుగా పనిచేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించడం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో పైలట్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

''అవినీతి విషయంలో మేము ఎలాంటి రాజీకి రాలేదు. ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చాను. నేను లేవనత్తిన అంశాలపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఇవాళే ఇందుకు చివరిరోజు'' అని పైలట్ తెలిపారు. అవినీతిపై ఎలాంటి రాజీ ఉండదని కాంగ్రెస్, రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, అవినీతిపై ఎవరైనా రాజీ పడితే దానిని సహించరాదని, రాజస్థాన్‌లో వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని పైలట్ మరోసారి స్పష్టం చేశారు.

సహనం ఉండాలన్న గెహ్లాట్...

ఢిల్లీలో అధిష్ఠానంతో సమావేశానంతరం గెహ్లాట్ సైతం ఈ ఏడాది చివర్లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను, పైలట్ కలిసి పని చేస్తామని, ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సహనంతో కష్టపడి పనిచేయాలని, భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుందని సోనియాగాంధీ కాంగ్రెస్ కన్వెన్షన్‌లో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

Updated Date - 2023-05-31T19:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising