దేశంలో 64 జేఎన్.1 వేరియంట్ కేసులు
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:00 AM
దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్-వేరియంట్ ‘జేఎన్.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు
న్యూఢిల్లీ, డిసెంబరు 25: దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్-వేరియంట్ ‘జేఎన్.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సోమవారం మరో 628 కరోనా కేసులు వెలుగుచూడగా మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 4,504కు చేరింది. కాగా, జేఎన్.1 వేరియంట్ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం జేఎన్.1 తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు సోకిందని, ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 01:00 AM