ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ntr-Koratala siva: ఎన్టీఆర్‌ 30 వాయిదా

ABN, First Publish Date - 2023-02-20T13:38:31+05:30

ఎన్టీఆర్‌ హీరోగా ఈ నెల 24న ప్రారంభం కానున్న ‘ఎన్టీఆర్‌ 30’ చిత్రం పూజా కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఎన్టీఆర్‌ సోదరుడు తారకరత్న మరణంతో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్‌ (NTR) హీరోగా ఈ నెల 24న ప్రారంభం కానున్న ‘ఎన్టీఆర్‌ 30’ (NTR 30) చిత్రం పూజా కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఎన్టీఆర్‌ సోదరుడు తారకరత్న Taraka ratna is no more) మరణంతో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే తెలియజేస్తామని ఎన్టీఆర్‌ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5 విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. తారకరత్న అకాల మరణంతో ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా వేశారు. (Ntr 30 postponed)

హీరో తారకరత్న శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే! కుప్పం నుంచి ప్రారంభమైన నారా లోకేశ్‌ యువ గళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రే బెంగుళూరు ఆస్పత్రి నుంచి తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం సోమవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉంచారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Updated Date - 2023-02-20T14:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising