ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Colombo: కొలంబోలో సెక్యూరిటీ గార్డు కాల్పులు...8మందికి గాయాలు

ABN, First Publish Date - 2023-05-02T07:03:21+05:30

శ్రీలంక దేశంలో ఓ సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది....

Colombo Shooting
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: శ్రీలంక దేశంలో ఓ సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది.(Colombo Shooting) కొలంబో హార్బర్‌లోని(Colombo harbour) గేట్ 06 సమీపంలో సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా 8 మంది గాయపడ్డారని(Injured) శ్రీలంక పోలీసులు చెప్పారు.గాయపడిన 8 మందిని కొలంబో జాతీయ ఆసుపత్రిలో(Colombo National Hospital) చేర్చారు.ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నిర్మాణ స్థలంలో సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

రహదారి నిర్మాణ స్థలంలో ఇనుము దొంగిలించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను బ్లూమెండల్ స్ట్రీట్ వద్ద ఒక సమూహం అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పోలీసులు తెలిపారు.సైట్‌లోని ఒక సెక్యూరిటీ గార్డు మరో సెక్యూరిటీ గార్డు నుంచి తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించినప్పుడు గుంపుపై కాల్పులు జరిపాడు.గాయపడిన వారిలో నలుగురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.ఈ కాల్పుల ఘటనపై ఫోర్‌షోర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-05-02T07:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising