ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hong Kong: 5 లక్షల విమాన టిక్కెట్ల ఉచిత పంపిణీ.. హాంకాంగ్ నిర్ణయం

ABN, First Publish Date - 2023-02-02T23:29:30+05:30

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు విమానయాన టిక్కెట్ల ఉచిత పంపిణీకి ప్రారంభించనున్న హాంకాంగ్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను హాంకాంగ్‌‌వైపు(Hong kong) ఆకర్షించే దిశగా అక్కడి ప్రభుత్వం త్వరలో భారీ ప్రచారకార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఏకంగా 5 లక్షల విమానయాన టిక్కెట్లను(Airline Tickets) వివిధ దేశాల వారికి ఉచితంగా అందించనుంది. ఈ కార్యక్రమానికి హాంకాంగ్ నేత జాన్ లీ నేతృత్వం వహించనున్నారు. కాథే పసిఫిక్ ఎయిర్‌లైన్స్, హెచ్2కే ఎక్స్‌ప్రెస్ ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. కొన్ని టిక్కెట్లను అంతర్జాతీయ ట్రావెల్ ఏజెంట్లు, టూరిజం సంస్థల ద్వారా బట్వాడా చేస్తారు.

2019 నాటి హింసాత్మక నిరసన కారణంగా హాంకాంగ్ పరపతి కాస్తంత దెబ్బతింది. దీనికి తోడు కొరోనా సంక్షోభం కారణంగా పర్యాటక రంగం చతికిలపడటంతో దేశఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ క్రమంలో ఆర్థికస్థితిని మళ్లీ పట్టాలెక్కించాలని నిశ్చయించిన ప్రభుత్వం ఉచిత టిక్కెట్ల పంపిణీ కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. చైనా, ఐరోపా, అమెరికాల్లోని పర్యాటకులకు వీటిని అందించనున్నారు. 2022లో హాంకాంగ్‌ను సుమారు ఆరు లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. కరోనా ఆంక్షలు క్రమంగా ఎత్తేయడంతో పర్యాటకం మెల్లగా ఊపందుకుంది. 2021లో కేవలం 91 వేల మందే హాంకాంగ్‌ను సందర్శించగా ఏడాది తిరిగే సరికల్లా ఈ సంఖ్య దాదాపు ఆరు రెట్లు పెరిగింది. పర్యాటక రంగానికి మరింత ఊపుతెచ్చేందుకు ప్రభుత్వం ప్రస్తుతం వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది.

Updated Date - 2023-02-02T23:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising