ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yoga: యోగాసనాలతో పూర్తి ఫలం దక్కాలంటే..!

ABN, First Publish Date - 2023-08-17T11:00:21+05:30

యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే యోగాసనాల పూర్తి ఫలం దక్కించుకోవాలంటే యోగాభ్యాస ప్రయోజనాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం కూడా అవసరమే!

యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే యోగాసనాల పూర్తి ఫలం దక్కించుకోవాలంటే యోగాభ్యాస ప్రయోజనాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం కూడా అవసరమే!

ప్రసరిత పాదోత్తనాసనం

రెండు కాళ్లూ, రెండు చేతులూ నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే....

  • వెన్ను సాగదీయబడుతుంది.

  • తొడలు, పిక్కలు, పిరుదుల్లోని కండరాలు బలపడతాయి.

  • మనసు నెమ్మదించి, ఒత్తిడి, ఆందోళన, గందరగోళం, తలనొప్పులు, భుజాల్లో నొప్పులు తగ్గుతాయి.

  • ఈ ఆసనంతో నాడీ వ్యవస్థ స్వాంతన పొందుతుంది.

  • మరింత క్లిష్టమైన యోగాసనాలను సాధన చేసేందుకు వీలుగా ఈ ఆసనం శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

అధోముఖ కపోతాసనం

ఒక కాలును మడిచి, మరో కాలును వెనకగా చాపి కూర్చుని, శరీరాన్ని ముందుకు నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

  • వెనకకు వంగే ఆసనాలు వేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

  • తుంటి, తొడ ఎముకలు కలిసే కీలును బలపరుస్తుంది.

  • నడిచేటప్పుడు, పద్మాసనం వేసే సమయంలో, పరిగెత్తే సమయంలో, నిలబడినప్పుడు శరీరం మరింత తేలికగా కదిలేలా ఈ ఆసనం తోడ్పడుతుంది.

విపరీతకారణి

  • నేల మీద వెల్లకిలా పడుకుని, గోడ మీద కాళ్లు నిటారుగా చాపి ఉంచే ఈ ఆసనంతో ఒరిగే ప్రయోజనాలు ఇవి...

  • ఈ ఆసనం వేసే సమయంలో నడుము అడుగున దుప్పటి ఉండలా చుట్టి ఉంచుకుంటే, కాళ్ల వాపులు, అలసిపోయే కీళ్లు, భారంగా మారే తుంటి సమస్యలు తగ్గుతాయి.

విపరీతకారిణి ఆసనం వేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులకు కారణమయ్యే లింఫ్‌, ఇతర స్రావాలు ఆయా శరీర భాగాల నుంచి పొత్తికడుపులోకి చేరతాయి. ఫలితంగా కాళ్లు, పునరుత్పత్తి వ్యవస్థల్లోని ఇబ్బందులు తొలగుతాయి.

Updated Date - 2023-08-17T11:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising