ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Period pain: నొప్పికి ఆ లోపం కూడా కారణం కావొచ్చు..!

ABN, First Publish Date - 2023-05-23T12:58:49+05:30

పీరియడ్‌ పెయిన్‌, నెలసరి నలతను భరించడం సామాన్యమైన విషయమేమీ కాదు. పొత్తికడుపులో మొదలయ్యే మెలితిప్పే ఈ నొప్పి (డిస్మెనోరియా) పీరియడ్స్‌ ముందు మొదలై, నెలసరిలో మొదటి రెండు రోజులూ వేధిస్తూ

Period pain
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీరియడ్‌ పెయిన్‌, నెలసరి నలతను భరించడం సామాన్యమైన విషయమేమీ కాదు. పొత్తికడుపులో మొదలయ్యే మెలితిప్పే ఈ నొప్పి (డిస్మెనోరియా) పీరియడ్స్‌ ముందు మొదలై, నెలసరిలో మొదటి రెండు రోజులూ వేధిస్తూ ఉంటుంది. ఎండోవెట్రిరయాసిస్‌, ఫైబ్రాయిడ్స్‌, సర్వైకల్‌ స్టెనోసిస్‌, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ లాంటివి నెలసరి నొప్పులకు దారి తీసినా, కొన్ని పోషకాల లోపాల వల్ల కూడా నెలసరి నొప్పులు భరించలేనంతగా వేధిస్తాయి. ఆ లోపాల గురించి తెలుసుకుందాం!

మెగ్నీషియం: పీరియడ్‌ పెయిన్‌ పరంగా మెగ్నీషియం సూపర్‌ హీరో లాంటిది. మెగ్నీషియం తీసుకోవడం వల్ల గర్భాశయ కండరాలు ఉపశమించి, నెలసరి నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్లు ఉత్పత్తి తగ్గుతుంది.

విటమిన్‌ డి: అవసరానికి మించిన ప్రోస్టాగ్లాండిన్‌ హార్మోన్ల ఉత్పత్తి నెలసరి నొప్పిని పెంచుతుంది. విటమిన్‌ డి తీసుకోవడం వల్ల ఈ హార్మోన్‌ ఉత్పత్తి గాడిలో పడి, నొప్పులు తగ్గుతాయి. ఈ విటమిన్‌ లోపిస్తే, ప్రోస్లాగ్లాండిన్‌ హార్మోన్‌ల క్రమబద్ధీకరణ అదుపు తప్పి, నెలసరి నొప్పులు వేధిస్తాయి.

ఒమేగా 3: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు తక్కువగా తీసుకునే మహిళల్లో నెలసరి నొప్పులు పెరిగినట్టు పరిశోధనలో తేలింది. కాబట్టి సప్లిమెంట్ల రూపంలో లేదా ఫ్లాక్స్‌, షియా విత్తనాలు, నెయ్యి, వాల్‌నట్స్‌ ద్వారా సరిపడా ఒమేగా 3 తీసుకోవడం ద్వారా ఈ నొప్పులను అదుపులోకి తెచ్చుకోవచ్చు.

విటమిన్‌ ఇ: ఈ విటమిన్‌ తీసుకోవడం వల్ల కొన్ని పదార్థాల మీద వ్యామోహం తగ్గుతుంది.

Updated Date - 2023-05-23T13:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising