ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Makeup: ఫైవ్ మినిట్స్‌లో రెడీ కావొచ్చు! ఎలాగంటే..!

ABN, First Publish Date - 2023-04-01T12:11:25+05:30

ప్రతి రోజూ తప్పనిసరిగా మేకప్‌ వేసుకోవలసిన ఉద్యోగినులు ఉంటారు. వాళ్లకు మేకప్‌ చిటికెలో పూర్తయిపోయేలా ఉండాలి

Makeup
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రతి రోజూ తప్పనిసరిగా మేకప్‌ వేసుకోవలసిన ఉద్యోగినులు ఉంటారు. వాళ్లకు మేకప్‌ చిటికెలో పూర్తయిపోయేలా ఉండాలి. అలాంటి వాళ్లు సరిగ్గా ఐదు నిమిషాల్లో మేక్‌పను ముగించగలిగే ఫైవ్‌ మినిట్‌ మేకప్‌ చిట్కాలివి!

1. ముందుగా రంగు మారిన చోట, కళ్ల దిగువన దృష్టి పెట్టాలి. కళ్ల దిగువన నలుపు కనిపించకుండా ఫౌండేషన్‌ అద్దుకోడానికి ముందు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను పలుచగా అద్దుకోవాలి. అలాగే ముఖం మీది మచ్చలు, డాగుల మీద కూడా ఇలాగే అద్దుకోవాలి.

2. తర్వాత కన్‌సీలర్‌ను కళ్ల దిగువన, ముఖం మీది మచ్చల మీద అద్దుకుని చర్మపు రంగులో కలిసేవరకూ బఫ్‌ చేయాలి.

3. స్వీపింగ్‌ మోషన్‌తో బ్రష్‌తో ఫౌండేషన్‌ను ముఖమంతా పరుచుకునేలా చేయాలి. అవసరానికి మించిన ఫౌండేషన్‌ ఎబ్బెట్టుగా ఉంటుందనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి వీలైనంత తక్కువ ఫౌండేషన్‌ వాడుకోవాలి.

4. సెట్టింగ్‌ పౌడర్‌తో ఫౌండేషన్‌ చెదిరిపోకుండా సెట్‌ చేసుకోవాలి.

5. టి బోన్‌ ఏరియా, చుబుకం, చెక్కిళ్లు, జా లైన్‌ను బ్రాంజ్‌ చేయాలి. తర్వాత లైట్‌గా బ్లష్‌ చేయాలి.

6. ఐబ్రోలను ఐబ్రో పెన్సిల్‌తో ఫిల్‌ చేసి, మస్కారా వేసుకోవాలి.

7. లిప్‌లైన్‌ గీసుకుని, లిప్‌స్టిక్‌ నింపుకోవాలి.

8. టిష్యూ పేపర్‌ అద్ది, అదనపు లిప్‌స్టిక్‌ను తొలగించుకోవాలి.

Updated Date - 2023-04-01T12:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising