ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eye makeup: కళ్ల ఆకారాన్ని బట్టి మేకప్ చేసుకోవడం ఎలా అంటే..!

ABN, First Publish Date - 2023-05-06T12:02:19+05:30

అందరి కళ్లూ ఒకేలా ఉండవు. అలాంటప్పుడు అందరికీ ఒకే రకమైన ఐ మేకప్‌ ఎలా సూటవుతుంది? మేకప్‌తో కళ్ల ఆకర్షణ పెరగాలంటే, కళ్ల తీరుకు తగిన మేకప్‌ పద్ధతులను ఎంచుకోవాలి.

Eye makeup
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందరి కళ్లూ ఒకేలా ఉండవు. అలాంటప్పుడు అందరికీ ఒకే రకమైన ఐ మేకప్‌ ఎలా సూటవుతుంది? మేకప్‌తో కళ్ల ఆకర్షణ పెరగాలంటే, కళ్ల తీరుకు తగిన మేకప్‌ పద్ధతులను ఎంచుకోవాలి.

సోగ కళ్లు, పెద్ద కళ్లు, వాలు కళ్లు.. ఇలా కళ్ల నిర్మాణాన్ని బట్టి కళ్లను ఆరు రకాలగా విభజించారు అంతర్జాతీయ సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్టులు. వాళ్లిచ్చే ఐ మేకప్‌ సూచనల గురించి తెలుసుకుందాం!

అప్‌ టర్న్‌డ్‌ ఐస్‌:

కళ్ల కొనకల నుంచి కళ్ల చివర్లు ఎత్తుగా ఉంటే మీవి అప్‌ టర్న్‌డ్‌ కోవకు చెందిన కళ్లు అని అర్థం. ఇలాంటి కళ్లకు పల్చని ఐలైనర్‌ వేయాలి. ఇందుకోసం సన్నని మొన కలిగిన ఐలైనర్‌ను ఎంచుకుని, కను రెప్ప మొదలు నుంచి చివరి వరకూ సన్నని గీత గీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా లిక్విడ్‌ ఐలైనర్‌ను మాత్రమే వాడుకోవాలి. అలాగే అడుగున ఉన్న రెప్పలకు మస్కారా పల్చగా అద్దుకోవాలి.

రౌండ్‌ ఐస్‌:

కంటి లోపలి నల్లని కనుగుడ్డుకూ కింది రెప్పకూ దూరం ఉంటే, మీవి గుండ్రటి కళ్లు అని అర్థం. ఇలాంటి కళ్లకు హెవీ ఐలైనర్‌ ఉపయోగించాలి. ఐలైనర్‌ను కనురెప్ప మొదట్లో సన్నని గీతతో మొదలుపెట్టి, చివర్లో మందంగా పైకి వంపు తిప్పాలి. ఇలాంటి క్యాట్‌ ఐస్‌ ఐ మేకప్‌ గుండ్రటి కళ్లకు బాగుంటుంది. ఐలైనర్‌ క్రీమీ ఫినిష్‌ కలిగి ఉన్నదై ఉండాలి. సల్ట్రీగా కనిపించే ఐ లుక్‌ కోసం, కనురెప్ప చివర్లలో ముదురు రంగు షేడ్స్‌ వేయకుండా, కనురెప్పల మధ్యలో వేయాలి. అలాగే కింది కనురెప్పకు లైనర్‌ వేయకూడదు.

మోనోలిడ్‌ ఐస్‌:

పై కనురెప్ప మీద ముడత ఉండని కళ్లు ఇవి. ఇలాంటి కళ్లకు డైమెన్షన్‌ను తీసుకురావడం కోసం, కనురెప్పల మీద రిఫ్లెక్టివ్‌ షాడోస్‌ ఉపయోగించాలి. అలాగే వీలైనంత ఎక్కువ మస్కారాను కూడా వాడుకోవాలి. కనురెప్పలను తిప్పుకోవాలి. కనురెప్ప మీద ఐ షాడో ప్రైమర్‌ను అప్లై చేసి, ఆ తర్వాతే ఐ షాడో అద్దుకోవాలి.

డౌన్‌ టర్న్‌డ్‌ ఐస్‌:

ఇది అప్‌ టర్న్‌డ్‌కు వ్యతిరేకమైన షేప్‌. కను కొనకల కంటే కంటి చివర్లు కిందకు వాలిపోయి ఉంటాయి. ఇలాంటప్పుడు కంటి చివర్లను పైకి లేపే ఐ మేకప్‌ వేసుకోవాలి. కనురెప్ప మొదలులో లైట్‌ లేదా న్యూట్రల్‌ కలర్‌ ఐషాడో వేసుకోవాలి. కంటి చివరి వైపు ముదురు రంగు షాడో వేసుకోవాలి. యాంగిల్డ్‌ ఐ లైనర్‌ బ్రష్‌తో దిగువ కంటి రెప్పలకు డీపర్‌ షాడో అప్లై చేసుకోవాలి.

హూడెడ్‌ ఐస్‌:

పై కనురెప్పల మీదకు చర్మం జారి పడుతుంటే, ఆ కళ్లను హూడెడ్‌ ఐస్‌ అంటారు. పైబడే వయసు వల్ల కూడా కనురెప్పల్లో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి కళ్లున్నవాళ్లు డెలికేట్‌ ఐలైనర్‌ను వాడకూడదు. బదులుగా పై కనురెప్పకు హెవీ ఐ లైనర్‌ వేసుకోవాలి. అలాగే వీలైనంత ఎక్కువ మస్కారా వేసుకోవాలి.

ఆల్మండ్‌ ఐస్‌:

ఎక్కువ మందికి ఇవే కళ్లుంటాయి. కంటి లోపలి నల్లని కనుగుడ్లు పైరెప్పకూ, కింది రెప్పకూ ఆనుకుని ఉంటే, అవి కచ్చితంగా ఆల్మండ్‌ కోవకే చెందుతాయి. కనుకొనకల దగ్గర తేలిక రంగు కంటి చివర్లో ముదురు రంగు షాడో వేసుకోవాలి. పాయింటీ లిక్విడ్‌ ఐలైనర్‌తో కనురెప్ప చివర్లో వంపు తిప్పాలి. ఈ కళ్లకు తేలికపాటి మస్కారా సరిపోతుంది.

Updated Date - 2023-05-06T12:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising