ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సోయాపాలు రోజూ వాడవచ్చా?

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:10 PM

రోజూ పరిమితిలో సోయాపాలను తీసుకొంటే మంచిదే. సోయా గింజల నుండి తయారు చేసే పదార్థమే పాలు.....

మామూలు పాల మాదిరిగా సోయాపాలు రోజు వాడవచ్చా? అన్ని

వయసులవారికి మంచిదేనా? సోయాపాలతో ఉపయోగాలేమిటి?

- యశోద, సికింద్రాబాద్‌

రోజూ పరిమితిలో సోయాపాలను తీసుకొంటే మంచిదే. సోయా గింజల నుండి తయారు చేసే పదార్థమే పాలు. శాకాహారులకు అత్యుత్తమమైన ప్రొటీన్‌ సోర్స్‌ సోయా. ఆవు లేదా గేదె పాలు సరిపడని వారు, ఏవైనా కారణాల వల్ల అవి తాగేందుకు ఇష్టపడని వారు, వాటికి ప్రత్యామ్నాయంగా సోయా పాలను వాడవచ్చు. మామూలు పాలతో పోలిస్తే సోయాపాలలో క్యాలరీలు తక్కువే. సోయా పాలలో కూడా మాములు పాలలాగానే ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. దీంతో పాటు కొంచెం పిండి పదార్థాలు, పీచుపదార్థాలు కూడా సోయాపాలలో లభిస్తాయి. విటమిన్‌ కె, థయామిన్‌, ఫోలెట్‌ లాంటి విటమిన్లు, మాలిబ్డినమ్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌ లాంటి ఖనిజలవణాలు సోయాలో పుష్కలం. సోయా పాలలో అధికంగా ఉండే ఐసోఫ్లేవోన్స్‌ గుండె జబ్బులు, బ్రెస్ట్‌ కాన్సర్‌, ప్రొస్టేట్‌ కాన్సర్‌ మొదలైనవాటి నుండి రక్షణ నిస్తాయి. సోయా బీన్స్‌ అలెర్జీలు ఉన్నవారు తప్ప తక్కిన వారందరూ సోయా పాలు తాగవచ్చు. అయితే మార్కెట్లో అధికంగా లభించే సోయా పాలు రుచి కోసం చక్కెర కలిపినవి ఉంటున్నాయి. అవి కాకుండా చక్కెర కలపని సోయాపాలనే ఎంచు కుంటే ఆరోగ్యానికి మంచిది.

నాకు 40 ఏళ్ళు. గత కొంత కాలంగా అజీర్తి సమస్యతో బాధ పడుతున్నాను. ఈ సమస్యకు పరిష్కరం ఏమిటి?

- చంద్రశేఖర్‌, గద్వాల

అజీర్తి సాధారణంగా దీర్ఘకాలిక సమస్య కాదు. ఏదైనా ఆహారాన్ని అవసరమైనదానికంటే అధికంగా తీసుకోవడం, సమయానుసారం ఆహారం తీసుకోకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, అధికంగా కొవ్వు పదార్థాలు, మసాలాలు ఉన్న ఆహారం తినడం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏదైనా అనారోగ్యం ఉండడం.... ఇలా వివిధ కారణాల వల్ల అజీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించా లంటే సమయానికి ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. మసాలాలు, నూనెలు అధి కంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కాయగూరలు, ఆకుకూరలను ప్రతి పూటా భోజనంలో చేర్చుకోవాలి. కాఫీ టీలకు దూరంగా ఉండాలి. గ్రీన్‌ టీ లేదా బ్లాక్‌ కాఫీలు పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. భోజనానికి ముందు తరువాతా కూడా పది నిమిషాల నడక అజీర్తి సమస్యను కొంత తగ్గిస్తుంది. అలాగే రోజులో కనీసం అరగంటైనా వ్యాయామానికి కేటాయించడం, రోజు మొత్తంలో కూడా శరీరానికి కదలిక ఉండేలా చూసుకోవడం కూడా అజీర్తి అధిగమించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా రాత్రి భోజనం తప్పనిసరిగా నిద్రా సమయానికి కనీసం రెండు మూడు గంటల ముందే ముగించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్టయితే వైద్యులను సంప్రదించాలి.

శీతాకాలంలో జామకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలపండి.

- రశ్మి, బాసర

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో అవసరమయ్యే విటమిన్‌ సి జామకాయలో ఉంటుంది. ఈ పండులో మన శరీరానికి అవసరమయ్యే పలు రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. జామకాయ పండు అయినప్పటికీ దీనిలో చక్కర శాతం మామూలు పళ్లకంటే తక్కువ ఉండడం వల్ల ఇది మధుమేహం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. జామకాయలో ఉండే పెక్టిన్‌ అనే పీచుపదార్థం మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పీచు పదార్థం వల్ల ఆకలి తగ్గడం, దాని వాళ్ళ బరువు నియంత్రణలో ఉంచడం కూడా చేస్తుంది. జామకాయల్లో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును నివారించడానికి, మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జామకాయల్లో ఆంథోసయానిన్లు అనే యాంటియాక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి మన చర్మ ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. పచ్చి జామకాయల్లో ఈ ఆంథోసయానిన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి రక్తంలో చక్కర పరిమాణాన్ని నియంత్రిస్తాయి. అయితే పచ్చి జామకాయల్లో వగరును ఇచ్చే కొన్ని పదార్థాలు ఉంటాయి. అధికంగా పెక్టిన్‌ కూడా ఉండడం వల్ల కొంతమందికి ఇవి తింటే దగ్గు రావచ్చు. వాళ్లు దోరగా పండిన జామ కాయలు తింటే సరిపోతుంది.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - Dec 17 , 2023 | 01:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising