ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Care: మీ జట్టుకు రక్షణ ఈ పొడులే!

ABN, First Publish Date - 2023-08-24T15:44:39+05:30

ఆయుర్వేదంలో జుట్టును సంరక్షించుకోవటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వీటిలో హెయిర్‌మా్‌స్కలను తయారుచేసుకోవటం ఒక ప్రధానమైన అంశం. ఈ హెయిర్‌మా్‌స్కను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

ఆయుర్వేదంలో జుట్టును సంరక్షించుకోవటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వీటిలో హెయిర్‌మా్‌స్కలను తయారుచేసుకోవటం ఒక ప్రధానమైన అంశం. ఈ హెయిర్‌మా్‌స్కను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

తయారీ విధానం

మన జుట్టును సంరక్షించే అనేక రకాల పౌడర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని.. వాటిని నీటితో కానీ.. పెరుగుతో కానీ.. కొబ్బరినూనెతో కానీ కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత షాంపుతో జుట్టును కడగాలి. ఇప్పుడు ఆ పౌడర్లు ఏమిటో చూద్దాం..

భృంగరాజ పొడి

భృంగరాజను మూలికల్లో రారాజుగా పిలుస్తారు. ఇది జుట్టును బలంగా చేస్తుంది. జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. కొందరిలో జుట్టు తెల్లపడకుండా అడ్డుకుంటుంది.

ఉసిరి పొడి

ఉసిరి పొడిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. జుట్టు బలంగా పెరగటానికి ఉపకరిస్తుంది.

వేప పొడి

కొందరికి మాడుపై బ్యాక్టీరియా చేసి రకరకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. దురద పెడుతూ ఉంటుంది. ఈ సమస్యలకు వేప పొడి మంచి పరిష్కారమని చెప్పాలి.

మందార పొడి

మందారంలో విటమిన్స్‌, అమినో యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి జుట్టు ఊడిపోకుండా రక్షిస్తూ ఉంటాయి.

మెంతి పొడి

మెండి పొడిలో ప్రొటీన్‌, నికోటినిక్‌ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి జుట్టు ఉడిపోకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. మెంతి పొడిని పెరుగుతో కలిపి రాస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

కుంకుడు పొడి

జుట్టులో ఉండే దుమ్మును తొలగించటంలో కుంకుడు పొడి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దీని వల్ల జుట్టులో సహజంగా ఉండే నూనెలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. షికాకాయ్‌ పొడి కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి ఉపకరిస్తుంది.

Updated Date - 2023-08-24T15:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising