Nota : నోటాకు ఓటు వేస్తే ఏమవుతుంది..!
ABN, First Publish Date - 2023-11-28T12:59:53+05:30
ఎవరైనా బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకుంటే పోలింగ్ బూత్ లోని ప్రిసెడింగ్ అధికారి వద్దరు వెళ్ళి నోటా ఓటు వేయాల్సి వచ్చేది.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పట్ల ప్రజలకు అసంతృప్తి ఉంటే ఆ విషయాన్ని నోటా ద్వారా ఓటర్లు తెలియజేయవచ్చు. ఈ విధానాన్ని 2003లో భారత ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకొచ్చింది. తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో అసలు ఈ నోటా అంటే ఏమిటి? దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
నోటా అంటే..
నోటా అంటే 'నన్ ఆఫ్ ది ఎబో' అని అర్థం. బరిలో నిలిచిన అభ్యర్థులపై విశ్వాసం లేని పక్షంలో ఓటరు ‘నోటా’కి ఓటు వేయవచ్చు. ఈ మేరకు ఓటర్లు అందరికీ ఎన్నికల సంఘం హక్కు కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అయితే నోటా ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఓటర్లకు లేదు. నోటా కేవలం అభ్యర్థులపై విశ్వాసం లేదని మాత్రమే చెప్పగలరు.
నోటా ఓటు లెక్కించబడుతుందా?
నోటాగా పోలైన ఓట్లను లెక్కిస్తామని, అయితే వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. కాబట్టి నోటాకు వేసిన ఓట్లు ఎన్నికల ఫలితాన్ని మార్చలేవు.
అయితే నోటా ఉపయోగం ఏమిటి?
పోటీ చేసే అభ్యర్థుల పట్ల అసంతృప్తిగా ఉన్న వ్యక్తులు తన అభిప్రాయాన్ని నోటా ద్వారా తెలియజేయవచ్చు. అయితే దీని ద్వారా ఏ అభ్యర్థికీ మద్ధతు ఇవ్వకపోయినా ఎక్కువమంది ఓటు వేసేందుకు వచ్చే అవకాశాలు పెరిగాయి. బోగస్ ఓట్ల లెక్కింపు తగ్గుతుంది. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా ధైర్యంగా చెప్పగలిగే వీలు కూడా నోటా కల్పించింది. అలాగే ప్రతికూల ఓటింగ్ వల్ల ఎన్నికలలో వ్యవస్థాగత మార్పు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు స్వచ్ఛమైన అభ్యర్థులను ఎంచుకునే అవకాశం కూడా లేకపోలేదు.
నోటాకు ఓటు ఎలా వేస్తారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) అభ్యర్థుల జాబితా దిగువన 'నన్ ఆఫ్ ది ఎబౌ బటన్' ఆప్షన్ ఉంటుంది. దీనికి ముందు ఎవరైనా బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకుంటే పోలింగ్ బూత్‌లోని ప్రిసెడింగ్ అధికారి వద్దరు వెళ్ళి నోటా ఓటు వేయాల్సి వచ్చేది. కాలక్రమంలో దీనిని రద్దు చేశారు.
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎలాంటి ఫలితాలుంటాయనే దానిమీద ఎన్నికల సంఘం ఎలాంటి నియమాలను ప్రకటించలేదు. కానీ పోటీ చేస్తున్న అభ్యర్థులకంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రెండో స్థానంలో ఉన్న వ్యక్తినే గెలిచినట్లుగా ప్రకటిస్తారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-29T21:47:57+05:30 IST