ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC: పరీక్షల రద్దు వేళ మెన్నేని సంతోష్ రావు సలహాలు

ABN, First Publish Date - 2023-03-17T19:14:48+05:30

గ్రూప్స్‌కు కోచింగ్ ఇచ్చే మెన్నేని సంతోష్ రావు కొన్ని విలువైన సలహాలిస్తున్నారు.

TSPSC Paper Leak Case
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకై పరీక్షలు రద్దు చేసిన తరుణంలో పరీక్షలు రాసిన, రాయబోతోన్న అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఈ తరుణంలో గ్రూప్స్‌కు కోచింగ్ ఇచ్చే నిపుణులు మెన్నేని సంతోష్ రావు కొన్ని విలువైన సలహాలిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష రద్దు కావడంతో ప్రభుత్వం జూన్‌లో ప్రిలిమ్స్, అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహించే అవకాశముందని సంతోష్ రావ్ అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులకు ఆయన పలు సూచనలు చేశారు. అవేమిటంటే...

మిగిలిన నాలుగు నెలల సమయాన్ని ప్రిపరేషన్‌ విషయంలో సద్వినియోగం చేసుకోవాలి.

జూన్ వరకూ ప్రిలిమ్స్ కోసం 2/3 వ వంతు సమయాన్ని, 1/3 వ వంతు సమయాన్ని మెయిన్స్ కోసం ప్రిపేర్ కావాలి.

యూపీఎస్‌సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌కు, గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌కు ఒకేసారి ప్రిపేర్ కావాలి.

ఇప్పటికే మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న వాళ్లు ప్రిలిమ్స్ కోసం కోర్ సబ్జెక్ట్‌పై దృష్టి సారించాలి.

కరెంట్ ఎఫైర్స్‌ కోసం ప్రముఖ కోచింగ్ సంస్థల మేగజైన్స్‌ను ఫాలో కావాలి.

కరెంట్ ఎఫైర్స్‌కు సంబంధించిన సబ్జెక్ట్స్ నోట్స్‌ను సిద్ధం చేసుకోవాలి.

పేపర్ క్లిష్టంగానే ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టే ప్రిపేర్ అవ్వాలి.

టైం మేనేజ్‌మెంట్ కోసం ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి.

టెస్ట్ సిరీస్, గ్రాండ్‌ టెస్టులలో పార్టిసిపేట్ చేయాలి.

జాబ్ చేస్తున్న వాళ్లు ప్రిలిమ్స్ అయ్యాక జాబ్‌కు లీవ్ పెట్టాలి.

ప్రిలిమ్స్‌ రీజనింగ్, మెయిన్స్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ను కంబైన్డ్‌గా ప్రాక్టీస్ చేయాలి.

Updated Date - 2023-03-17T20:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising