ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Medical seats: రాష్ట్రంలో 483 మెడికల్‌ సీట్లు ఖాళీ

ABN, First Publish Date - 2023-09-24T08:18:09+05:30

రాష్ట్రంలో 59 ఎంబీబీఎస్‌ సీట్లు సహా మొత్తం 483 వైద్యకోర్సులకు సంబంధించిన సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్వయం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 59 ఎంబీబీఎస్‌ సీట్లు సహా మొత్తం 483 వైద్యకోర్సులకు సంబంధించిన సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్వయం ప్రతిపత్తి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌(MBBS, BDS) సీట్లను ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయి, ప్రస్తుతం చివరి విడత జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్‌ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. విదేశాల్లో నివసించే తమిళులకు సంబంధించి ఖాళీగా ఉన్న 34 సీట్ల భర్తీ కోసం శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 30లోపున కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆలిండియా కోటా సీట్లకు కేంద్ర వైద్యమండలి మూడు విడతల కౌన్సెలింగ్‌ను పూర్తి చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా 1640 ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీకానున్నాయి. అందులో ఆలిండియా కోటా సీట్లు 872 దాకా ఉన్నాయి. రాష్ట్రంలో మాత్రమే 484 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న 59 ఆలిండియా కోటా సీట్లు భర్తీ కాలేదు. మదురై ఎయిమ్స్‌ కళాశాలలో 12 సీట్లు భర్తీ కాలేదు. ఆలిండియా కోటా సీట్లను ఈ నెల 30లోపున వాపసు చేసుకోవాలని, లేకుంటే అడ్మిషన్ల గడువు తేదీని పొడిగించాలని కేంద్రప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలపై ఒత్తిడి చేస్తోంది. పైగా ప్రైవేటు విద్యా సంస్థలు కటాఫ్‌ మార్కులను 30 దాకా తగ్గించేందుకు కేంద్రప్రభుత్వ అనుమతిని కోరుతున్నాయి. ఈ విషయమై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ... ఆలిండియా కోటా సీట్లు 872, ఎయిమ్స్‌, జిప్మర్‌, అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం వంటి కేంద్ర విద్యా సంస్థలో 44 సీట్లు ఖాళీగా మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇలా ఖాళీగా ఉన్న సీట్లతో పోల్చుకుంటే ఐదింట రెండు భాగాలకు చెందిన సీట్లు మాత్రమే స్వయం ప్రతిపత్తి విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయని చెప్పారు. పైగా 44 సీట్లు ఎన్‌ఆర్‌ఐ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించగా, అవి భర్తీ కాకుండా మిగిలిపోయాయని వివరించారు.

Updated Date - 2023-09-24T08:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising