Professor posts: భారీ జీతంతో తెలంగాణ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టులు.. అర్హతలు ఇవే..!
ABN, First Publish Date - 2023-08-03T12:50:35+05:30
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద కాల వ్యవధి ఏడాది.
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద కాల వ్యవధి ఏడాది.
ఖాళీలున్న ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు: వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, సూర్యాపేట
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధనానుభవం ఉండాలి.
వయసు: 69 ఏళ్లు మించకూడదు
వేతనం: ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు; అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు అదనంగా మరో రూ.50 వేలు ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ: పీజీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను స్కాన్ చేసి ఇ-మెయిల్ ద్వారా పంపాలి.
ఇ-మెయిల్: dmerecruitment. contract@gmail.com
ముఖ్య తేదీలు
అసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవాలి
అర్హులకు ఆగస్టు 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు
ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 24లోగా జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలి.
వెబ్‌సైట్: https://dme.telangana.gov.in/
Updated Date - 2023-08-03T12:50:35+05:30 IST