B.Ed: 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీఎడ్ దూరవిద్య
ABN, First Publish Date - 2023-04-27T10:59:02+05:30
15 ఏళ్ల క్రితం నిలిపివేసిన బీఎడ్ దూరవిద్య కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి పునః ప్రారంభం కానుంది.
ప్యారీస్(చెన్నై): మద్రాసు యూనివర్శిటీ(University of Madras) 15 ఏళ్ల క్రితం నిలిపివేసిన బీఎడ్ దూరవిద్య కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి పునః ప్రారంభించనుంది. మద్రాసు యూనివర్సిటీ నిర్వహించే దూరవిద్య కోర్సులకు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ కోర్సుల్లో 2018-19లో 17,051 మంది విద్యార్థులు చేరగా 2022-23లో వారి సంఖ్య 36,712 మంది పెరిగింది. విద్యార్థుల పెరుగుదలతో వర్శిటీ ఆదాయం రూ.65 కోట్ల నుంచి రూ.98 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో, 2023-24 విద్యా సంవత్సరంలో మళ్లీ బీఎడ్ దూరవిద్య కోర్సును ప్రారంభించనున్నట్లు ప్రకటన విడుదలైంది.
Updated Date - 2023-04-27T10:59:04+05:30 IST