ఈ వారం వివిధ కార్యక్రమాలు 18 12 2023
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:05 AM
‘నాగలి కూడా ఆయుధమే’ కవితా సంపుటి, తెలంగాణ కథ 2022 - ‘దురస్తు’, ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు పురస్కారం, భట్టిప్రోలు దుర్గాలక్ష్మీ ప్రనన్న కవితల పోటీ...
‘నాగలి కూడా ఆయుధమే’ కవితా సంపుటి
విల్సన్‌రావు కొమ్మవరపు కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే’ ఆవిష్కరణ సభ డిసెంబరు 19 సా.6గంటలకు రవీంద్రభారతి, హైద రాబాద్‌లో జరుగుతుంది. సభలో దార్ల వెంకటేశ్వరరావు, కొలకలూరి ఇనాక్, కె. శివారెడ్డి, కె. శ్రీనివాస్, కోయి కోటేశ్వరరావు, మామిడి హరి కృష్ణ, యాకూబ్, ఎం. నారాయణశర్మ, ఎం.వి.రామిరెడ్డి, జెల్ది విద్యాధర్ రావు పాల్గొంటారు.
పాలపిట్ట బుక్స్
తెలంగాణ కథ 2022 - ‘దురస్తు’
‘నల్గొండ కథా పాఠశాల’ ఆధ్వర్యంలో ‘దురస్తు’ తెలంగాణ కథ- 2022 ఆవిష్కరణ సభ డిసెంబరు 24న నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల, అలమ్నాయ్ హాల్లో జరుగుతుంది. సభలో సంగిశెట్టి శ్రీనివాస్, బి. నర్సింగ రావు, మేరెడ్డి యాదగిరిరెడ్డి, పగడాల నాగేం దర్, పెరుమాళ్ళ ఆనంద్, ఉప్పల పద్మ, వెల్దండి శ్రీధర్ తదితరులు పాల్గొంటారు.
సింగిడి
ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు పురస్కారం
అరసం వరంగల్ వారు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు సాహిత్య పురస్కారాన్ని 2023 సంవత్సరానికి రమణ యశస్వి ‘మా గణపవరం కథలు’, నెల్లుట్ల రమాదేవి ‘తల్లి వేరు’ కథా సంపుటాలకు సంయుక్తంగా ప్రదానం చేస్తారు. పురస్కార ప్రదానోత్సవం డిసెంబర్ 24 ఉ.11గంటలకు హన్మకొండలోని ప్రభుత్వ అభ్యసన ప్రాథమిక పాఠశాలలో జరుగుతుంది. సభలో పెనుగొండ లక్ష్మినారాయణ, వేల్పుల నారాయణ తదితరులు పాల్గొంటారు.
పల్లేరు వీరస్వామి
భట్టిప్రోలు దుర్గాలక్ష్మీ ప్రనన్న కవితల పోటీ
2024 సంవత్సరానికి భట్టిప్రోలు దుర్గాలక్ష్మీ ప్రనన్న స్మారక వచన కవితల పోటీలను నిర్వహిస్తున్నాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.3వేలు, రూ. 2వేలు, రూ.1000. ప్రోత్సా హక బహుమతిగా ఐదు కవితలకు ఒక్కొక్క కవితకు రూ.500. కవితలను జనవరి 31లోగా చిరునామా: దాట్ల దేవదానం రాజు, జిక్రయనగర్, యానాం (పోస్ట్) - 533464కు పంపాలి. వివరాలకు ఫోన్: 9440105987. బహుమతులు మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవ సదస్సులో ప్రదానం చేయబడతాయి.
కవిసంధ్య
Updated Date - Dec 18 , 2023 | 12:05 AM