ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అద్దె ఇల్లు

ABN, First Publish Date - 2023-12-11T00:33:57+05:30

ఊరుపొమ్మన లేదు నగరం రమ్మన లేదు సొంతిల్లు లేనే లేదు ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి ఎన్నుకున్న దారి! చెల్లించే మొత్తానికి తగిన ఇల్లు ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుంది!...

ఊరుపొమ్మన లేదు

నగరం రమ్మన లేదు

సొంతిల్లు లేనే లేదు

ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి

ఎన్నుకున్న దారి!

చెల్లించే మొత్తానికి తగిన ఇల్లు

ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుంది!

ఎప్పటికైనా ఖాళీ చేయడం తప్పదని తెలిసినా

అద్దె ఇంటిపై పెంచుకున్న మమకారం

అమరికలో అరమరికలు లేకుండా

ఒక్కో వస్తువూ వాటి స్థానంలో అమరిపోతుంటాయి!

ఎన్నో సందర్భాలు ఎన్నెన్నో సన్నివేశాలు

ఆ ఇంటి గోడల్లో నిక్షిప్తం చేసుకుంటాయి!

ఇల్లు మారుతున్న ప్రతిసారీ

కొన్ని గుర్తులను వదిలేసి

కొన్ని జ్ఞాపకాలను మూటకట్టుకుని

మరో అద్దె ఇంటిలో నెమరువేసుకుంటుంటాము!

ఆ ఇంట్లో రూపుదిద్దుకున్న

కన్న బిడ్డల భవిష్యత్తు అంచనాలు

నిజమవుతున్న వేళ

అర్ధాంతరంగా చెదిరిపోయినట్లు భావన!

పిల్లలకు గోరుముద్దల సుద్దులు చెప్పి

బుజ్జగించిన సమయాలన్నీ మదిలోనే మిగిలిపోతాయి -

గోడకు వేలాడుతున్న ఫోటోలు

తమ స్థానాలు కదులుతూంటే

బేలగా చూస్తుంటాయి!

ఇరుగుపొరుగులతో పెనవేసుకున్న

ఆత్మీయ బంధాలను

అపురూపమైన స్నేహహస్తాలను వదిలేసి

వెళుతూ ఉంటే గుండె భారమై మనసు మెలిపెట్టే బాధ!

పసిపిల్లల్లా పెంచుకున్న రంగు రంగుల పూల మొక్కల్ని

ఒంటరిగా వదిలేసి

తులసి మొక్కను దోసిట్లో పొదవుకుని

మరో ఇంటివైపు నడక సాగిస్తాము!

సాయం కోసం వచ్చిన ప్యాకర్స్‌ కంపెనీ వాళ్లు

గమ్యానికి చేరవేసే క్రమంలో

కొన్ని వస్తువుల ఆనవాలు మాయం అవుతుంటాయి!

గుడ్డలతో చుట్టి తీసుకువెళ్లిన పెద్దపెద్ద వస్తువులన్నీ

మరో ఇంట్లో వాటి స్థానాల కోసం వెతుక్కుంటూ ఉంటాయి!

మన ప్రమేయం లేకుండానే

వస్తున్న మార్పును ఆహ్వానిస్తూ

మరో అద్దె ఇంటిలో కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ

కొత్త అనుబంధాలను కలుపుకుంటూ

జీవన గమనాన్ని కొనసాగిస్తుంటాము!

అద్దె ఇల్లంటే అడిగినంత కాలం నీడనిచ్చే అమ్మ చెట్టే కానీ

జీవితాంతం నివసించేందుకు గూడు కాదు!

జయంతి వాసరచెట్ల

99855 25355

Updated Date - 2023-12-11T00:33:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising