ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చిత్తనూరులో ‘ఇథనాల్‌’ విధ్వంసం

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:44 AM

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు అధికార పార్టీని ఓడించి కాంగ్రెస్‌ పార్టీని ఎన్నో ఆశలతో గెలిపించారు. పాలకపక్షం ఓడిపోవటానికి ఎన్నో కారణాలున్నాయి...

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు అధికార పార్టీని ఓడించి కాంగ్రెస్‌ పార్టీని ఎన్నో ఆశలతో గెలిపించారు. పాలకపక్షం ఓడిపోవటానికి ఎన్నో కారణాలున్నాయి. దాని ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిరస్కరించారు. ఇలాంటి తప్పుడు విధానాల్లో ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడం కూడా ఒకటి. దీనివల్ల జరిగే నష్టమేమిటో, అది ప్రజల జీవితాలను, జీవన విధానాన్ని ఎలా తలక్రిందులు చేస్తుందో నారాయణపేట జిల్లాలోని చిత్తనూరు ప్రాంతంలో ఇథనాల్‌ కంపెనీ జరిపిన విధ్వంసాన్ని చూస్తే కాని మనకు అర్థం కాదు.

పెట్రోలు ఇంధనంపై అయ్యే వ్యయంలో 20శాతం ఆదా చేయడానికి 80శాతం వ్యవసాయ కుటుంబాలు తమ స్వంత వినియోగానికి మాత్రమే పండించగలిగే భూమి ధ్వంసం చేయబడుతున్నది. ఇథనాల్‌ ఉత్పత్తి కొరకు భారత ప్రభుత్వం తెలంగాణ నారాయణపేట జిల్లాలో ‘జూరాల ఆర్గానిక్‌ ఫార్మా అండ్‌ ఇండస్ట్రీస్‌’ పేరుతో ఇథనాల్‌ ఉత్పత్తి ఇండస్ట్రీని పెట్టటానికి అనుమతించింది. ఇథనాల్‌ ఇండస్ట్రీ పెట్టటానికి మన్నెంవాగు చుట్టూ ఉన్న వరి పంట పండే భూములతో పాటు అసైన్డ్‌ భూములను సేకరించారు. అంతా కలిపి 457 ఎకరాల పంటభూములలో ఈ కంపెనీని పెట్టారు.

ఈ భూములలో పంటల పెరుగుదలకై కరువు కాటకాలతో మగ్గుతున్న రైతులు సాగునీటి సదుపాయం కొరకు పోరాడి సాధించిన కోయిల్‌సాగర్‌ సాగునీటిని ఇథనాల్‌ కంపెనీకి మళ్లించారు. రోజుకు 25 లక్షల లీటర్ల నీరు ఇథనాల్‌ కంపెనీ వాడుకుంటున్నది. ఇలా ప్రజలకు జీవనోపాధియైన వ్యవసాయ భూమి, సాగునీరు తగ్గడంవల్ల సాగు భూమి కూడా తగ్గుతుంది. జీవనోపాధులు కోల్పోయినవారికి ప్రతిఫలంగా ఈ పేద ప్రజలకు ఇథనాల్‌ కంపెనీ కల్మషాలు, విషవాయువులు, విషాలతో కలుషితమైన త్రాగునీరు మాత్రమే మిగిలాయి.

ఇథనాల్‌ ఉత్పత్తి ప్రక్రియలో ప్రతీరోజు 450 టన్నుల బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌డై ఆక్సైడ్‌) అక్కడి గ్రామాల గాలిలో కలుస్తున్నది. ఇక కంపెనీ నుండి వెలువడుతున్న కల్మషాలు గ్రామస్తుల తాగునీటి వనరు అయిన మన్యం వాగులో కలుపుతున్నారు. నీరు కల్మషం కావటం వల్ల చేపలు చనిపోయాయి. పేద ప్రజలకు సహజసిద్ధంగా దొరికే పౌష్ఠికాహారం కొరత ఏర్పడింది. మన్యం వాగులో ఎప్పటిలాగే పిల్లలు స్నానాలు చేస్తే వాళ్ల ఒంటినిండా దద్దుర్లు రావడం జరిగింది. ఇలాంటి విష కల్మషాలు ఈ ఇథనాల్‌ కంపెనీ నుండి వెలువడుతున్నాయని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఉద్యమమే దీనికి గత్యంతరమని గత రెండు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత ఉద్యమం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పడింది. ఈ కమిటి పిలుపు మేరకు పౌర ప్రజాసంఘాలు నిజనిర్దారణ కొరకు మూడు గ్రామాల్లో విస్తృతంగా ప్రజలను కలిసి వారి అనుభవాలను విన్నారు. పోలీసుల లాఠీచార్జ్‌వల్ల తమకు అయిన గాయాలను ప్రజలు ఈ కమిటీకి చూపించారు. ఈ మూడు గ్రామాలు– చిత్తనూరు, ఎక్లాస్‌పూరు, జిన్నారం ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇవేకాక ఆ చుట్టుప్రక్కల 54 ఇతర గ్రామాల ప్రజలు కూడా ఇథనాల్‌ బాధితులే.

ఇలాంటి బాధలకు గురౌతున్న ఉద్యమ నాయకులు సంయమనంతో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు వివరించారు. ఈ ఉద్యమం శాంతియుతంగా మాత్రమే జరగాల్సిందని ప్రజలతో ప్రమాణస్వీకారం చేయించి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ విధంగా శాంతియుతంగా ఉద్యమం నడపాలని నిర్ణయించుకున్నందున నాయకులు, ఉద్యమ కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర సంబంధిత సంస్థలతోపాటు మానవహక్కుల కమిషన్‌, పర్యావరణ పరిరక్షణ సంస్థలను కలిసి ప్రజలు పడుతున్న బాధలను వాళ్ల దృష్టికి తెచ్చి తగిన చర్యలు తీసుకోమని కోరారు.

గ్రామీణ బాధితులు ఢిల్లీదాక వెళ్లి సంబంధిత ప్రభుత్వ సంస్థల దృష్టికి సమస్యలను తీసుకువెళితే ఏ ఒక్క కేంద్ర అధికారిగాని, సంస్థగాని స్పందించలేదు. ఎలాంటి సహాయ సహకారాలను అందించలేదు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే ధోరణిని ప్రదర్శించాయి. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామిక ప్రభుత్వమే కాక స్వయం ప్రతిపత్తిగల సంస్థలు కూడా క్రియాశీలకంగా స్పందించలేదు. వీరి వృత్తిపర బాధ్యతలు ఎందుకు నిర్వహించడంలేదు? ఈ సంస్థలన్నీ పనిచేస్తున్న విధాన సంస్కృతి చూస్తే అవి ప్రజలకు ఎంతదూరమై పోయాయో స్పష్టంగా తెలుస్తున్నది.

ప్రజలు తమ ఉద్యమంలో భాగంగా గత అక్టోబర్‌ 21న ఒక ట్యాంకర్‌ ఇథనాల్‌ కంపెనీ నుండి బయలుదేరి హైవే వైపు వెళుతుండగా గ్రామ ప్రజలు ట్యాంకర్‌ను అడ్డుకొని ఆ ట్యాంకర్‌లో ఏముందో తమకు చూపాలని కోరారు. ట్యాంకర్‌తో పాటు ఉన్న కంపెనీ సిబ్బంది సంబంధిత అధికారులు వస్తారని చెప్పారు. 21వ తారీకు రాత్రంతా గ్రామస్తులు ట్యాంకు చుట్టే కూర్చున్నారు. మరునాడు 22న ఎంపీడీఓ వచ్చి సమస్యను తాము పరిశీలిస్తామని చర్చిస్తున్న సమయంలోనే దాదాపు వందల మంది పోలీసులు వచ్చారు. ఒక పోలీసు వ్యాన్‌కు ఎవరో నిప్పంటించారు. ఇది ఎలా జరిగిందో విచారణ జరిపించే బదులు పోలీసులు ప్రజలపై లాఠీచార్జ్‌ చేశారు. అక్కడున్న గ్రామస్తులు ఎక్కువగా మహిళలే ఉన్నా అందరు పరిగెత్తుతున్నప్పుడు వాళ్లపై రాళ్లు రువ్వడం జరిగింది. ఇందులో చంద్రమ్మ అనే మహిళకు కాలు విరిగింది. అక్కడే కుప్పకూలింది. సుహాసిని అనే అమ్మాయి తలకి రాయి తగిలి రక్తసిక్తమయింది. ఈమెకు మూడు కుట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రమ్మ భర్త రాయప్ప మాటల్లో ‘నాకు, నా ముగ్గురి కూతుళ్లకు తన కూలీ డబ్బులతో నా భర్య చంద్రమ్మ కూడు పెడుతున్నది. ఇప్పుడు మా గతేమికాను? ఏ ఎమ్మెల్యే వచ్చి మమ్ము ఆదుకుంటాడు?’ అంటూ వాపోయాడు. లాఠీచార్జీలు ఆపకుండా పోలీసులు గ్రామంలో బీభత్సం సృష్టిస్తూ గ్రామస్తుల ఇళ్లలోకి దూరి కనిపించిన యువకులనంతా పోలీసుస్టేషన్‌కు పట్టుకెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లో లేకుండా పొలాల్లో పనిచేసుకుంటున్న వాళ్లు, అంగడికి పక్క ఊరికి వెళ్లిన యువకులు పోలీసుల బీభత్సాన్ని తెలుసుకొని ఇంటికి రాకుండా బంధువుల ఊరిలో ఉండిపోయి ఎక్కడో తలదాచుకోవటానికి పోగా వృద్ధ తల్లిదండ్రులు, భార్యా పిల్లలు తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో అని భయాందోళనకు గురయ్యారు.

నిజనిర్ధారణ కమిటీ నవంబర్‌ 16న వెళ్లేప్పటికి పోలీసుల బీభత్సం జరిగి 25 రోజులు దాటింది. పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన నిర్బంధ భయం నుండి వీరు కోలుకోలేదు. స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారు. ఇంకా కొంతమంది యువకులు పోలీసు స్టేషన్‌ నుంచి తిరిగి వచ్చాక జ్వరాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇంతటి భయానకాన్ని సృష్టించిన అధికార వర్గాలు యవకులపై తప్పుడు కేసులు బనాయించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని తమ మ్యానిఫెస్టోలో చేర్చారు. కాబట్టి గ్రామాలలోకి యువకులపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి. మొత్తం ఇథనాల్‌ ఫ్యాక్టరీ చేస్తున్న విధ్వంసాన్ని సమీక్షించాలి. ఫ్యాక్టరీని మూసివేయాలి. ఈ ఫ్యాక్టరీయే కాక రాష్ట్ర, దేశ వ్యాప్తంగా నిర్మాణమవుతున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీలను కూడా సమీక్షించాలి. కొన్ని దేశాలలో ఇథనాల్‌ ఉత్పత్తిని నిషేధించారన్న వాస్తవాన్ని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలిక పర్యవసానాల దృష్ట్యా ఇథనాల్‌కు ప్రత్యామ్నాయాలను వెతకాలి.

డా. ఎం.వనమాల

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - Dec 22 , 2023 | 03:44 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising