ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అనేకం

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:09 AM

ప్రస్తుతం నేను సుప్తావస్థలో ఉన్న ఆవృతబీజాన్ని పోరుభూమి అగాథంలో పాతుకుపోయిన నిర్జీవ ఉద్యమ విత్తుని...

ప్రస్తుతం నేను

సుప్తావస్థలో ఉన్న

ఆవృతబీజాన్ని

పోరుభూమి అగాథంలో

పాతుకుపోయిన

నిర్జీవ ఉద్యమ విత్తుని

వెలివేత కంచెల్లో

లోలోపలికి తొక్కేయబడిన

నిషిద్ధ గింజని

తరాలుగా ప్రయత్నిస్తున్నా

మొలకెత్తలేని ప్రశ్నని

దురాక్రమణల మట్టిలో

కూరుకుపోయిన

జాతి మూలాన్ని

నేను ఒక్కడినే

నా కన్నీటి ముఖాలనేకం

నా దేహం ఒక్కటే

నెత్తురోడుతున్న

పచ్చి గాయాలనేకానేకం

దుఃఖ ధారలొక్కటే

కన్నీటి చుక్కల కథలే

కోకొల్లలు

స్వేచ్ఛాధాతువునై

ప్రసరించడానికి

ఊపిరి ఉనికిని చాటించే

జాతి నీడనై వ్యాపించడానికి

తెగించి చిగురిద్దామంటే

నా ఒంటరి కన్నీటి చెమ్మ

చాలటం లేదు

జన్మ జన్మలుగా

వృథా పోసుకుంటున్న

మీ కన్నీటిని

కుండలు కుండలుగా

నా మట్టిపొరల్లోలోపలికి

దిమ్మరించండి

లేదంటే

ఒక్క నెత్తుటి చుక్కనైనా

నా ఒంటిపై చిమ్మండి

యుగాలనాటి

బానిస ఆంక్షలను

అణచివేతల వివక్షలను

తెగనరికే

ఉద్యమ ఖడ్గాన్నై

మొలకెత్తుతాను

పోరు పుప్పొడిని చల్లి

ప్రశ్నల పిడికిళ్లై

విరబూయడం

తెగిపడిన దేహాలతోనే

వంచనపై కలబడటం

ఆనక విజయగీతాలు

పాడటం నేర్పుతాను

నేనిప్పుడు

అస్తమించని విప్లవ సూర్యుణ్ణి

పెల్లుబికిన స్వేచ్ఛాసంద్రాన్ని

రాయబడని మన కథకు

నెత్తుటి సిరా చుక్కని

మిరప మహేష్‌

9948039026

Updated Date - Dec 18 , 2023 | 12:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising