అయ్యోపాపం ఎంతఘోరం.. పిల్లిని కాపాడబోయిన ఆ యువకుడు ఏమయ్యాడో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-09-23T13:27:46+05:30
చెట్టులో చిక్కుకున్న పిల్లిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన సంఘటన
దొడ్డబళ్ళాపుర(బెంగళూరు): చెట్టులో చిక్కుకున్న పిల్లిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన సంఘటన పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రం సమీపంలోని గ్యారేజ్ వెనుకభాగంలో శుక్రవారం చోటు చేసుకుంది. శాంతి నగర్ నివాసి జబీవుల్లా కుమారుడు రోషన్ (21) గ్యారేజ్‌లో పెంచుతున్న పిల్లి చెట్టు ఎక్కింది. మెడలోని గొలుసు చెట్టు కొమ్మలకు చిక్కుకుని అరవసాగింది. దీన్ని గమనించిన రోషన్ చెట్టుపైకి ఎక్కాడు. అయితే చెట్టు మీదుగా ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న దొడ్డ బళ్ళాపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-09-23T13:27:46+05:30 IST