ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలేంటి.. 3 నెలల పాప పొట్టపై 51 సార్లు ఇనుప చువ్వతో కాల్చి..

ABN, First Publish Date - 2023-02-04T19:11:34+05:30

వైద్యం ఇంతగా అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా కొందరు మూఢ నమ్మకాలనే పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నాటు వైద్యాన్ని నమ్ముకుని కష్టాల పాలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో తల్లిదండ్రుల మూఢనమ్మకానికి 3 నెలల పసి పాప బలైపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యం ఇంతగా అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా కొందరు మూఢ నమ్మకాలనే పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నాటు వైద్యాన్ని నమ్ముకుని కష్టాల పాలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో తల్లిదండ్రుల మూఢనమ్మకానికి 3 నెలల పసి పాప బలైపోయింది. న్యూమోనియాతో బాధపడుతున్న 3 నెలల పసికందుకు తల్లిదండ్రులు చేయించిన నాటు వైద్యం ప్రాణాల మీదకు తెచ్చింది. తల్లిదండ్రుల ఎదుటే నరక యాతన అనుభవించిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది (Crime News).

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) షాదోల్‌ జిల్లాలో కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి కొన్ని రోజులుగా న్యూమోనియాతో (Pneumonia) బాధపడుతోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తల్లిదండ్రులు తమ పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా స్థానికంగా ఉన్న మంత్రగాడికి చూపించారు. చికిత్స పేరుతో ఆ మంత్రగాడు పాప పొట్టపై కాల్చిన ఇనుప రాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టాడు. ఆ బాధ తట్టుకోలేక పాప నరక యాతన అనుభవించింది. అయినా ఆ పాప పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దిగజారింది.

తల్లిదండ్రులు ఆ పసికందును స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువై చిన్నారి మృతి చెందింది (3 months old baby died after poked 51 times with hot rod). పాపకు తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. శిశువు కడుపుపై ​​కాల్చిన గాయాలను గమనించిన వైద్యులు.. రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వచ్చిన అధికారులు చిన్నారి తల్లిదండ్రులను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసేందుకు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-02-04T19:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising