ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రహదారులు రక్తసిక్తం.. మూడు ప్రమాదాల్లో మొత్తం ఎంతమంది చనిపోయారో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-06-16T08:24:07+05:30

రాష్ట్ర రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. మేల్‌మరువత్తూరు, తిరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): రాష్ట్ర రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. మేల్‌మరువత్తూరు, తిరుత్తణిలతో పాటు తిరుపత్తూరులలో ఈ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే... చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కంలోని కాట్టుకూడలూరు గ్రామానికి చెందిన శేఖర్‌ (50) తన భార్య రాణి (42), మనవరాలు అక్షయ (4)లు కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై చెంగల్పట్టు సమీపంలోని ఆలప్పాక్కం గ్రామంలోని తమ బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్ళారు. వేడుక తరువాత తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. వీరి బైకు అచ్చరపాక్కం సమీపంలో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో శేఖర్‌, రాణి, అక్షయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై మేల్‌మరువత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో పాల క్యాన్ల వ్యాను రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాను డ్రైవర్‌ రాజేంద్రన్‌ (25), కూలీలు మాణిక్‌ రాయ్‌ (32), ఉజాల్‌ (25) తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ప్రమాదంపై రెడ్‌హిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా, తిరుపత్తూరు జిల్లాలో ఆటో - బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కళాకారులు సారధి (20), కార్తీక్‌ (18), అరవిందన్‌ (20)లు మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-06-16T08:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising