ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Police case: సంచలనం... మాజీ పోలీస్ బాస్‏పై కేసు

ABN, First Publish Date - 2023-04-16T12:57:12+05:30

మాజీ డీజీపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం పోలీసు వర్గాల్లో తీవ్ర సవచలనం కలిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): గుట్కా అవినీతి కేసులో రాష్ట్ర మాజీ డీజీపీ రాజేంద్రన్‌(Former DGP of the state Rajendran), చెన్నై నగర మాజీ పోలీస్‌ కమిషనర్‌ జార్జి తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. 2016లో ఆదాయపన్ను శాఖ అధికారులు రెడ్‌హిల్స్‌ సమీపంలోని ఓ గోడౌన్‌లో జరిపిన తనిఖీల్లో లభించిన డైరీలో, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పీవీ రమణ, నాటి డీజీపీ టీకే రాజేంద్రన్‌, పదవీ విమరణ పొందిన నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.జార్జి తదితర పోలీసు ఉన్నతాధికారులు, ఎక్సైజ్‌ అధికారులు, ఆహార భద్రతా శాఖ అధికారుల పేర్లతో లంచా లు తీసుకున్నట్లు పేర్కొనబడివుంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. అనంతరం ఈ కేసు విచారణ సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసుతో సంబంధాలున్న మాజీ మంత్రి విజయభాస్కర్‌, మాజీ మంత్రి రమణ, మాజీ డీజీపీ రాజేంద్రన్‌, మాజీ పోలీస్‌ కమిషనర్‌ జార్జి తదితరులకు సొంతమైన ఇళ్లు సహా 35 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు 2018 సెప్టెంబరు 5వ తేది సోదాలు చేసి ముఖ్యమైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ కేసు కు సంబంధించిన గోడౌన్‌ యజమానులు మాధవరావు, శ్రీనివాసరావు, ఉమాశంకర్‌ గుప్తా, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారి ఎన్‌.కే.పాండ్యన్‌, ఆహార భద్రతా శాఖ అధికారి సెంథిల్‌ మురుగన్‌, తిరువళ్లూర్‌ జిల్లా ఆహార భద్రత శాఖ జాయింట్‌ కమిషనర్‌ శివకుమార్‌ తదిరులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మాజీ మంత్రులు విజయభాస్కర్‌, రమణను 2018 డిసెంబరు 15న సీబీఐ(CBI) అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో, ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు ఆహార భద్రతా అధికారు లు, ఇద్దరు పోలీసు శాఖ అధికారులపై మాత్రమే చార్జ్‌షీటు దాఖలైంది. అనంతరం మాజీ మంత్రులు విజయభాస్కర్‌, రమణపై దాఖలు చేసిన చార్జ్‌షీటులో అన్నాడీఎంకే హయాంలో నిషేధించిన మాదకద్రవ్యాల విక్రయానికి లంచం తీసుకున్నట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పోలీసు మాజీ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.

Updated Date - 2023-04-16T12:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising