పెళ్లైన రెండో రోజే వరుడి ఆత్మహత్మ.. వధువు ముహూర్తపు చీరతోనే ఉరేసుకుని..
ABN, First Publish Date - 2023-09-22T10:21:59+05:30
కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపంలోని కచ్చేరి గ్రామంలో పెళ్తైన రెండో రోజే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వధువు
అడయార్(చెన్నై): కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపంలోని కచ్చేరి గ్రామంలో పెళ్తైన రెండో రోజే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వధువు చీరతోనే ఉరేసుకున్నాడు. చెంగల్పట్టు జిల్లా తిమ్మావరానికి చెందిన శ్వేత (21), కచ్చేరి గ్రామానికి చెందిన శరవణన్ (27) బంధువులు. దీంతో చిన్న వయసు నుంచే వీరిద్దరూ స్నేహితులు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి ఇరు కుటుంబాల పెద్దలు ఈనెల 17న వివాహం జరిపించారు. వివాహం జరిగిన రెండురోజుల తర్వాత దంపతులు వధువు ఇంటికిరాగా, ఈనెల19న శోభనం ఏర్పాటు చేశారు. 20వ తేదీన వేకువజామున 5 గంటల సమయంలో శ్వేత పెద్దగా కేకలు వేస్తూ, గది తలుపులు తెరుచుకుని బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. కుటుంబ సభ్యులు పడక గదికి వెళ్ళిచూడగా, వరుడు ఉరేసుకుని కనిపించాడు. వధువు ముహూర్తపు చీరతోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై చెంగల్పట్టు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
Updated Date - 2023-09-22T10:21:59+05:30 IST