ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నేహితులతో కలిసి భార్య, కూతురిని కిడ్నాప్ చేసిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2023-02-05T18:54:01+05:30

హర్యానాలో (Haryana) ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య, స్వంత కూతురినే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. కత్తులు, కర్రలతో ఇంట్లోకి ప్రవేశించి అత్తమామాలను కొట్టి భార్యను, కూతురిని ఎత్తుకుపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హర్యానాలో (Haryana) ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య, స్వంత కూతురినే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. కత్తులు, కర్రలతో ఇంట్లోకి ప్రవేశించి అత్తమామాలను కొట్టి భార్యను, కూతురిని ఎత్తుకుపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు (Crime News).

నర్వానాలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన పాయల్‌ అనే యువతికి మూడు సంవత్సరాల క్రితం ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత వీరికి రిద్ధి అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత పాయల్, ప్రవీణ్ మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. త్వరలోనే విచారణ తేదీ రానుంది. శనివారం సాయంత్రం పాయల్ ఇంటిలోకి 15 మందితో కలిసి ప్రవీణ్ బలవంతంగా ప్రవేశించాడు. అందరి చేతుల్లోనూ కత్తులు, కర్రలు ఉన్నాయి. పాయల్‌ను, రిద్దిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రవీణ్ ప్రయత్నించాడు (Man kidnaps his wife and daughter).

TamilNadu: ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు.. హెల్మెట్ ధరించి ఆ భర్త చేసిన ఘోరమేంటంటే..

అడ్డుకునేందుకు ప్రయత్నించిన పాయల్ తండ్రిని, తల్లిని అందరూ కలిసి చితక్కొట్టారు. పాయల్ తండ్రిని రోడ్డుపై పడేసి అతనిపై నుంని కారును నడపడానికి ప్రయత్నించారు. అయితే త్రుటిలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్‌తో పాటు మరో 15 మందిపై దాడి, కిడ్నాప్, హత్యాయత్నం సహా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-02-05T18:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising