ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Courier: చివరకు ఇలా చేస్తున్నారన్నమాట.. కొరియర్‌ ద్వారా మత్తు మాత్రల దిగుమతి

ABN, First Publish Date - 2023-06-04T10:00:01+05:30

కొరియర్‌(Courier) ద్వారా మత్తుమాత్రలు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్న వ్యవహారంలో దంపతులు సహా నలుగురిని అరెస్టు చేశారు. స్థానిక కొడుంగై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దంపతులు సహా నలుగురి అరెస్టు

పెరంబూర్‌(చెన్నై): కొరియర్‌(Courier) ద్వారా మత్తుమాత్రలు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్న వ్యవహారంలో దంపతులు సహా నలుగురిని అరెస్టు చేశారు. స్థానిక కొడుంగైయూర్‌లో నొప్పుల నివారణకు వినియోగించే మత్తుమాత్రల విక్రయాలు జరుగుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శరవణన్‌కు సమాచారం అందింది. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన విచారణలో, కొడుంగైయూర్‌ ఎళిల్‌నగర్‌లోని ఓ చిరునామాకు తరచూ గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ నుంచి కొరియర్‌లో పార్శిళ్లు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఆ చిరునామాకు కొరియర్‌ వచ్చిందని సిబ్బంది ద్వారా తెలుసుకున్న పోలీసులు, ఆ చిరునామాలో కొరియర్‌ అందించాలని కోరారు. కొరియర్‌ సిబ్బంది సమా చారం అందించగా చంద్రశేఖర్‌నగర్‌ మూడో వీధికి వచ్చి తీసుకుంటామని తెలపడంతో, అక్కడ కాపు వేసిన పోలీసులు అక్కడికి వచ్చిన రంజిత్‌కుమార్‌, ఆయన భార్య దివ్యను అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారం మేరకు ఈ వ్యవహారంలో సంబంధాలున్న ఎళిల్‌నగర్‌కు చెందిన అరుళ్‌, అరుణ్‌రాజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సూరత్‌ నుంచి నొప్పి నివారణ మాత్రలు కొరియర్‌ ద్వారా తెప్పించుకొని ఒక్కో మాత్రను రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారని తేలింది. ఈ వ్యవహారంలో మరెవరికైనా సంబంధాలున్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2023-06-04T10:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising