ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రెండు వివాహాలు దాచి.. మళ్లీ పెళ్లి.. రూ.60 లక్షల నగదు, నగలు తీసుకొని..

ABN, First Publish Date - 2023-09-15T07:53:34+05:30

రెండు వివాహాల జరిగిన విషయం దాచి తనను వివాహం చేసుకోవడంతో పాటు రూ.60 లక్షల నగదు, నగలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలని

- వేలూరు డీఐజీకి తిరుపతి జిల్లా మహిళ ఫిర్యాదు

వేలూరు(చెన్నై): రెండు వివాహాల జరిగిన విషయం దాచి తనను వివాహం చేసుకోవడంతో పాటు రూ.60 లక్షల నగదు, నగలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా నాగలాపురానికి చెందిన రమ్య (38) వేలూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు. రమ్యకు 2007లో చెన్నైకి చెందిన కుమారస్వామితో వివాహం కాగా, వారికి ఓ కుమార్తె ఉంది. అయితే 2020లో కుమారస్వామి అనారోగ్యంతో మృతిచెందడంతో తన కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించిన రమ్య తల్లిదండ్రులు.. ఓ వివాహ పరిచయ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చారు. తిరుపత్తూర్‌ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్‌ ఈ ప్రకటన చూసి, వారిని సంప్రదించాడు. తాను ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నట్లు నమ్మబలికిన వినోద్‌కుమార్‌.. వేలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం(Vellore Sub Registrar Office)లో రమ్యను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆ దంపతులు అరియూర్‌ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. వివాహ సమయంలో రమ్య తల్లిదండ్రులు 50 సవర్ల నగలు, 4 కిలోల వెండి వస్తువులు ఇచ్చారు. వాటిని స్వాహా చేసిన వినోద్‌కుమార్‌.. అనంతరం రమ్యకు చెందిన కారు, ద్విచక్రవాహనం, స్థలాన్ని తన పేర రాయించుకుని మోసం చేశాడు. అతడి గురించి ఆరా తీయగా, ఇప్పటికే రెండు వివాహాలు చేసుకుని, మోసం చేసినట్లు తెలిసింది. దీంతో రమ్య వేలూరు డీఐజీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన డీఐజీ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లు రమ్య మీడియాకు తెలిపారు.

Updated Date - 2023-09-15T07:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising