ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: నీలి చిత్రాలు చూపి.. స్నేహితులతో గడపమంటున్నాడు

ABN, First Publish Date - 2023-07-09T08:08:23+05:30

ఆమె ఓ ఉపాధ్యాయని.. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరుల్ని తీర్చే పవిత్ర కార్యక్రమం నెరవేర్చుతోంది. అయితే అలాంటి ఉపాధ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భర్తపై పోలీసులకు ఉపాధ్యాయిని ఫిర్యాదు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఆమె ఓ ఉపాధ్యాయని.. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరుల్ని తీర్చే పవిత్ర కార్యక్రమం నెరవేర్చుతోంది. అయితే అలాంటి ఉపాధ్యాయినికే గంపెడంత కష్టం వచ్చిపడింది. ఉచ్ఛనీచాలు మరిచిన ఆమె భర్త.. విపరీత పోకడలతో వ్యవహరిస్తున్నాడు. ప్రతిరోజూ నీలిచిత్రాలు చూపిస్తూ.. ఆ తరహాలోనే తన స్నేహితులతోనూ గడపాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఆ నరకాన్ని భరించలేకపోయిన ఆ ఉపాధ్యాయురాలు.. మరో మార్గం లేక పోలీసులను ఆశ్రయించింది.

స్థానిక కీల్పాక్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో శనివారం ప్రజా విజ్ఞప్తుల దినం జరగ్గా.. పులియంతోపుకు చెందిన ఉపాధ్యాయురాలు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తన భర్త లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, తన స్నేహితులను ఇంటికి రప్పించి వారితోనూ ఉల్లాసంగా గడపాలని ఒత్తిడి చేస్తూ హింసిస్తున్నాడని పేర్కొంవొ. అంతేగాక భర్త బ్లూఫిలింలు చూపెట్టి వాటిలో ఉన్నట్లు తన స్నేహితులతో ‘గ్రూప్‌ సెక్స్‌’కు రావాలంటూ వేధిస్తున్నాడని తెలిపారు. వేధింపులు తట్టుకోలేక పెరియమేడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఆమెను సర్దిచెప్పి, ఫిర్యాదును పరిశీలిస్తామని పేర్కొంటూ ఆమెను అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ.. తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పెద్దగా కేకలు పెడుతూ, కిందపడి పొర్లాడుతూ పెద్దపెట్టున విలపించారు. దీంతో పోలీసులు.. వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ఆమెను పంపేశారు. గమనించిన మరికొందరు మహిళలు.. తమ ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు. దీంతో పరిస్థితిని గ్రహించిన పోలీసులు... అందరినీ అక్కడి నుంచి పంపేయడం గమనార్హం.

Updated Date - 2023-07-09T08:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising