Chennai: ఛీ.. వీడేం మనిషిరా బాబూ.. ఆరేళ్ల తన మేనకోడలిపై...
ABN, First Publish Date - 2023-09-30T10:27:58+05:30
నీలగిరి జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బాధిత బాలిక తల్లి, మేనమామకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
పెరంబూర్(చెన్నై): నీలగిరి జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బాధిత బాలిక తల్లి, మేనమామకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భర్త నుంచి వేరుగా వెళ్లిన మహిళ, తన సోదరుడితో కలసి జీవిస్తోంది. బాలికపై మేనమామ తరచూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయమై బాలిక తల్లికి చెప్పినా ఆమె, తన సోదరుడిని మందిలించలేదనే సమాచారం. ఈ నేపథ్యంలో, పాఠశాలకు వెళ్లిన బాలిక ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు దిగ్ర్భాంతి చెంది మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 2018 డిసెంబరు 5వ తేది తల్లి, మేనమామను అరెస్ట్ చేశారు. అనంతరం వారు బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసు ఊటీ మహిళా న్యాయస్థానం విచారిస్తుండగా, శుక్రవారం న్యాయమూర్తి శ్రీధరన్ తీర్పు వెలువరించారు. నిందితులు బాలిక తల్లి, మేనమామకు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు తలా రూ.30 వేల జరిమానా విధించారు. కాగా, ప్రస్తుతం బాలిక ప్రభుత్వం హోంలో ఉంటుండగా, బాలికను ఆదుకొనేలా రాష్ట్రప్రభుత్వం రూ.5 లక్షలు అందించాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Updated Date - 2023-09-30T10:27:58+05:30 IST