ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bangalore: అత్తా.. నీ కూతురిని చంపేశా... రండి..

ABN, First Publish Date - 2023-07-28T12:39:25+05:30

భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త ఆ వెంటనే అత్త(భార్య తల్లి)కి ఫోన్‌ చేసి నీ కూతురిని చంపేశానని రావాలంటూ ఫోన్‌ చేశారు. బుధవారం రా

- బెంగళూరులో దారుణం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త ఆ వెంటనే అత్త(భార్య తల్లి)కి ఫోన్‌ చేసి నీ కూతురిని చంపేశానని రావాలంటూ ఫోన్‌ చేశారు. బుధవారం రాత్రి చంద్రా లేఅవుట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. మూడలపాళ్య(Mudalapallya) శివానంద లేఅవుట్‌లో శంకర్‌, గీతా దంపతులు నివసించేవారు. ఇటీవల కొంతకాలంగా భార్య గీతపై భర్తకు అనుమానం చోటుచేసుకుంది. నెలరోజులుగా ఇంట్లో నిత్యం గొడవలు సాగేవని స్థానికుల ద్వారా తెలుస్తోంది. బుధవారం రాత్రి భార్యతో శంకర్‌ గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలోనే ఆవేశంలో భార్య గీత(33)ను కొట్టి చంపేశారు. భార్య మృతదేహాన్ని సోఫా మీదుకు తీసుకువచ్చి పడుకోబెట్టిన తర్వాత అత్తకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేదాక శంకర్‌(Shankar) ఇంట్లోనే ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భర్త శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2023-07-28T12:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising