ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wonderla: పదో తరగతి విద్యార్థుల కోసం వండర్‌లా హాల్ టికెట్ ఆఫర్!

ABN, First Publish Date - 2023-03-30T21:41:59+05:30

దేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా(Wonderla) విద్యార్థుల కోసం బ్రహ్మాండమైన ఆఫర్‌ను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: దేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా(Wonderla) విద్యార్థుల కోసం బ్రహ్మాండమైన ఆఫర్‌ను ప్రకటించింది. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో 10, 11, 12వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థుల కోసం ‘హాల్ టికెట్ ఆఫర్‌’ (Hall Ticket Offer)ను తీసుకొచ్చింది. విద్యార్థులు తమ ఒరిజినల్ హాల్ టికెట్లను చూపించడం ద్వారా వండర్‌లా ప్రవేశ టికెట్లపై 35 శాతం రాయితీ పొందొచ్చు. ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్, లేదంటే ఆఫ్‌లోనూ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, విద్యార్థులు పార్క్ ప్రవేశ ద్వారం వద్ద తమ ఒరిజినల్ హాల్ టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది.

సందర్శకులు తమ ప్రవేశ టికెట్లను వండర్‌లా అధికారిక వెబ్‌సైట్ (https://bookings.wonderla.com/) ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలాగే, పార్క్ కౌంటర్ల వద్ద కూడా నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ బెంగళూరు, కొచ్చితోపాటు హైదరాబాద్ పార్క్‌లోనూ అందుబాటులో ఉంటుందని వండర్‌లా తెలిపింది.

Updated Date - 2023-03-30T21:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising