ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భారత్‌ జీపీటీ రూపొందిస్తున్నాం

ABN, Publish Date - Dec 28 , 2023 | 02:38 AM

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-బొంబాయితో కలిసి ‘‘భారత్‌ జీపీటీ’’ రూపొందిస్తున్నట్టు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ చెప్పారు. అలాగే టెలివిజన్ల కోసం...

ముంబై: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-బొంబాయితో కలిసి ‘‘భారత్‌ జీపీటీ’’ రూపొందిస్తున్నట్టు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ చెప్పారు. అలాగే టెలివిజన్ల కోసం ఒక ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విడుదల చేసే విషయం కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఐఐటీ వార్షిక టెక్‌ఫె్‌స్టలో బుధవారం పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ‘‘జియో 2.0’’కు సంబంధించిన విజన్‌ ఇప్పటికే సిద్ధంగా ఉన్నదని చెప్పా రు. జియోకు, ఐఐటీకి మధ్య భాగస్వామ్యం 2014 నుంచే ఉన్నదని, తాము ఇప్పుడు పెద్ద లాంగ్వేజ్‌ మోడళ్లు, జెనరేటివ్‌ ఏఐ ద్వారా దాన్ని మరింత ముందుకు నడుపుతున్నామని అన్నారు. రాబోయే దశాబ్దిని శాసించేది ఈ అప్లికేషన్లేనని ఆకాశ్‌ స్పష్టం చేశారు. ఉత్పత్తులు, సేవలు రెండు విభాగాల్లోనూ ఏఐ పరివర్తిత ప్రభావం చూపుతుందని, అందుకే తాము సంస్థలో అంతర్గతంగానే కాకుండా తమ గ్రూప్‌లోని అన్ని రంగాలకు ఏఐని విస్తరింపచేస్తున్నామని ఆయన చెప్పారు. తాము మీడియా, కామర్స్‌, కమ్యూనికేషన్‌, డివై్‌సల విభాగంలో ఉత్పత్తులు, సేవలు ప్రవేశపెట్టనున్నామన్నారు. టివిల కోసం సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి తెచ్చేందుకు గత కొంత కాలంగా కృషి చేస్తున్నామని, దాన్ని ఎలా ప్రవేశపెట్టాలనే విషయంలో పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. 2024 సంవత్సరం కంపెనీకి ప్రత్యేక సంవత్సరమని పేర్కొంటూ కంపెనీల కోసం ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌ అందించనున్నట్టు ఆకాశ్‌ చెప్పారు.

Updated Date - Dec 28 , 2023 | 02:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising