ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రిలయన్స్‌ చేతికి వాల్ట్‌ డిస్నీ ఇండియా

ABN, Publish Date - Dec 26 , 2023 | 03:28 AM

ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం వాల్ట్‌ డిస్నీకి చెందిన భారతీయ వ్యాపారాలను విలీనం చేసుకునే విషయంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ సోమవారం ఒక నాన్‌ బైండింగ్‌ ఒప్పందంపై సంతకం చేసింది.

ఫిబ్రవరి నాటికి డీల్‌ పూర్తి

న్యూఢిల్లీ: ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం వాల్ట్‌ డిస్నీకి చెందిన భారతీయ వ్యాపారాలను విలీనం చేసుకునే విషయంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ సోమవారం ఒక నాన్‌ బైండింగ్‌ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ వ్యాపారాల్లో 51ః49 నిష్పత్తిలో వాటాల కొనుగోలుకు నగదు, స్టాక్‌ ఒప్పందంపై లండన్‌లో గత వారం సంతకాలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందం ఆచరణీయం చేయడంలో భాగంగా డ్యూ డిలిజెన్స్‌, వాల్యుయేషన్‌ త్వరలోనే ప్రారంభమవుతాయని అంటున్నారు. నియంత్రణ సంస్థల అనుమతులు, అన్ని రకాల వాణిజ్యపరమైన లావాదేవీలు ఫిబ్రవరి నాటికి పూర్తి కాగలవని భావిస్తున్నారు. అయితే జనవరి చివరి నాటికే అన్నీ పూర్తి చేయాలన్నది ఆర్‌ఐఎల్‌ ఆలోచన అంటున్నారు.

ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్‌ ప్రతినిధులెవరూ అందుబాటులో లేరు. డిస్నీ స్టార్‌ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అన్నీ సక్రమంగా పూర్తయితే మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతి పెద్ద విలీనం డీల్‌ ఇదే అవుతుందని, ,తద్వారా 100కి పైగా చానళ్లు, రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ గల ఒక దిగ్గజం ఏర్పాటవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. విలీనం అయిన సంస్థ దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారంలతో పోటీ పడుతుంది.

Updated Date - Dec 26 , 2023 | 03:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising