ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేపీఎంజీ, సిడ్బీలతో టీ-హబ్‌ ఒప్పందం

ABN, First Publish Date - 2023-11-17T02:42:38+05:30

జియోస్పేషియల్‌, స్పేట్‌ టెక్‌ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి కేపీఎంజీ, సిడ్బీ, ఫాల్కాన్‌ ఎక్స్‌, కేర్‌, క్యారియర్‌ గ్లోబల్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ జియోస్పేషియల్‌...

8వ వార్షికోత్సవంలో టీ-బ్రిడ్జ్‌’ ప్రకటన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జియోస్పేషియల్‌, స్పేట్‌ టెక్‌ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి కేపీఎంజీ, సిడ్బీ, ఫాల్కాన్‌ ఎక్స్‌, కేర్‌, క్యారియర్‌ గ్లోబల్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ జియోస్పేషియల్‌ ఇండస్ట్రీ్‌సతో (ఏజీఐ) టీ-హబ్‌ వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. స్టార్ట్‌పల్లో పెట్టుబడుల వ్యవస్థను మెరుగుపరచడానికి; దేశ, విదేశాల్లోని స్టార్ట్‌పలు ఒక దానికి ఒకటి మద్దతుగా ఉండడానికి ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి. టీ-హబ్‌ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, టీ-హబ్‌ సీఈఓ మహంకాళీ శ్రీనివా్‌సరావు, వ్యవస్థాపక డైరెక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ఎనిమిదేళ్లలో టీ-హబ్‌ తీర్చిదిద్దిన స్టార్ట్‌పలు దాదాపు రూ.29,050 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకోగలిగాయని టీ-హబ్‌ సీఈఓ మహాకాళీ శ్రీనివా్‌సరావు అన్నారు.

టీ-బ్రిడ్జ్‌ ప్రారంభం..: స్టార్ట్‌పలకు అంతర్జాతీయ మార్కెట్‌ ప్రవేశం కల్పించడానికి అంతర్జాతీయ వింగ్‌ ‘టీ-బ్రిడ్జ్‌’ను ప్రారంభించారు. దీంతో పాటు ఫ్యాక్టోర్యల్‌ సహకారంతో ‘టీ-స్కేల్‌’ కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 25 స్టార్ట్‌పలను సిరీ్‌స-ఏ నిధులు పొందడానికి వీలుగా సిద్ధం చేస్తారు.

Updated Date - 2023-11-17T02:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising