టెక్ వ్యూ 21,500 పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి
ABN, Publish Date - Dec 18 , 2023 | 01:20 AM
నిఫ్టీ గత వారం 21,000 వద్ద రియాక్షన్‌తో ప్రారంభమైనా 20,800 వద్ద కోలుకుని చివరి రెండు రోజుల్లో మరింత బుల్లి్‌షగా ట్రేడవుతూ మానసిక అవధి 21,500 సమీపంలో క్లోజైంది...
టెక్ వ్యూ
21,500 పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి
నిఫ్టీ గత వారం 21,000 వద్ద రియాక్షన్‌తో ప్రారంభమైనా 20,800 వద్ద కోలుకుని చివరి రెండు రోజుల్లో మరింత బుల్లి్‌షగా ట్రేడవుతూ మానసిక అవధి 21,500 సమీపంలో క్లోజైంది. ముందు వారంతో పోల్చితే 500 పాయింట్లు లాభపడింది. టెక్నికల్‌గా మార్కెట్ 18,800 వద్ద ప్రారంభమైన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 2,600 పాయింట్ల వరకు లాభపడింది. వరుసగా ఏడు వారాలుగా ఎలాంటి కరెక్షన్ లేకుండా లాభాల్లోనే ట్రేడవుతూ ముందుకు దూసుకుపోతోంది. అయితే ఓవర్ బాట్ స్థితిలోనే ఉన్నందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు తాజా పొజిషన్లు తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గత వారంలో మిడ్‌క్యాప్ సూచీ 1,200 పాయింట్లు, స్మాల్‌క్యాప్ సూచీ 480 పాయింట్లు లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ.30,000 కోట్లు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే ఈ బుల్లిష్ ట్రెండ్‌కు కారణం. టెక్నికల్‌గా కరెక్షన్ లేదా కన్సాలిడేషన్ ఏర్పడవలసి ఉంది.
బుల్లిష్ స్థాయిలు: మార్కెట్ జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో ఉన్నందు వల్ల రియాక్షన్ అనంతరం మాత్రమే కచ్చితమైన నిరోధాన్ని గుర్తించగలం. పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడయి 21,500 కన్నా పైన నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమిస్తుంది. ఆ పైన మానసిక అవధి 21,800.
బేరిష్ స్థాయిలు: ఏదైనా రియాక్షన్ ఎదురైనా 21,200 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే మైనర్ బలహీనతలో పడుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 21,000. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతగా భావించాలి.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 880 పాయింట్ల మేరకు లాభపడి మానసిక అవధి 48,000 కన్నా పైన క్లోజయింది. వచ్చే ఒకటి రెండు ట్రేడింగ్ సెషన్లలో రియాక్షన్‌లో పడినా ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. బలహీనపడినా భద్రత కోసం మద్దతు స్థాయి 47,500 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతగా భావించాలి.
పాటర్న్: రియాక్షన్‌లో పడి 21,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత సంకేతం ఇస్తుంది. అయితే ఈ స్థాయి ప్రస్తుతానికి కొంత దూరంలో ఉంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 21,540, 21,620
మద్దతు : 20,360, 20,300
వి. సుందర్ రాజా
Updated Date - Dec 18 , 2023 | 01:20 AM