ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వ్యవసాయ ఎగుమతులకు ఆంక్షల దెబ్బ

ABN, Publish Date - Dec 22 , 2023 | 04:49 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ ఎగుమతులు పెద్దగా పెరిగే అవకాశం కనిపిచడం లేదు. గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే 5,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4,41,331 కోట్లు) చేరే...

గత ఏడాది స్థాయిలోనే ఎగుమతులు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ ఎగుమతులు పెద్దగా పెరిగే అవకాశం కనిపిచడం లేదు. గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే 5,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4,41,331 కోట్లు) చేరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ చెప్పారు. గోధుమలు, బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించడం, చక్కెర ఎగుమతులపై ఆంక్షలు ఇందుకు కారణమన్నారు. ఈ ఆంక్షల ప్రభావం ఎంత లేదన్నా 450 కోట్ల డాలర్ల నుంచి 500 కోట్ల డాలర్ల వరకు ఉంటుందన్నారు. హౌతి తిరుగుబాటుదారుల దాడులతో ఎర్ర సముద్రం మీదుగా జరిగే బాస్మతి బియ్యం ఎగుమతులూ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాగా కొత్త మార్కెట్లకు అరటి పండ్లు, విలువ జోడించిన చిరుధాన్యాల ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అగర్వాల్‌ చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వచ్చే మూడేళ్లలో అరటి పండ్ల ఎగుమతులు 100 కోట్ల డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మధ్య కాలంలో పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, మాంసం, పాడి ఉత్పత్తులు, చికెన్‌, గుడ్ల ఎగుతుల్లో మంచి వృద్ధి రేటు కనిపించిందన్నారు. అయితే నిషేధం కారణంగా బియ్యం ఎగుమతులు 7.65 శాతం తగ్గి 650 కోట్ల డాలర్లకు చేరాయన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 04:49 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising