విశాఖ ఫార్మాసిటీలో వాటా విక్రయం
ABN, Publish Date - Dec 29 , 2023 | 04:39 AM
అనుబంధ కంపెనీ విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్‌లో (గతంలో రాంకీ ఫార్మా సిటీ) వాటాను రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విక్రయించనుంది...
రాంకీ ఇన్‌ఫ్రా బోర్డు నిర్ణయం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అనుబంధ కంపెనీ విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్‌లో (గతంలో రాంకీ ఫార్మా సిటీ) వాటాను రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విక్రయించనుంది. ఈ మేరకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. విశాఖ ఫార్మా సిటీ కొనుగో లుకు బిడ్డింగ్‌లో బ్రిజ్ గోపాల్ కనస్ట్రక్షన్ కంపెనీ ఎంపిక అయింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ను రూ.180కు కొనుగోలు చేస్తోంది. దీని ప్రకారం కంపెనీ వాటా విలువ రూ.165.24 కోట్లని రాంకీ ఇన్‌ఫ్రా వెల్లడించింది.
Updated Date - Dec 29 , 2023 | 04:39 AM