QuitPain Power Gel: హైదరాబాద్ మార్కెట్‌లోకి ఆయుర్వేదిక్ పెయిన్ జెల్.. ‘క్విట్ పెయిన్’
ABN, First Publish Date - 2023-01-06T20:54:54+05:30
తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం కలిగిగించే ఆయుర్వేదిక్ జెల్.. ‘క్విట్ పెయిన్’ (QuitPain
హైదరాబాద్: తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం కలిగిగించే ఆయుర్వేదిక్ జెల్.. ‘క్విట్ పెయిన్’ (QuitPain Power Gel) హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రముఖ న్యూట్రాస్యూటికల్, కాస్మెస్యూటికల్ ప్రొడక్ట్ కంపెనీ అయిన దక్కన్ హెల్త్‌కేర్ (Deccan Healthcare) లిమిటెడ్ దీనిని హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఇది నొప్పుల నుంచి తక్షణం ఉపశమనం కల్పిస్తుందని తయారీదారులు చెబుతున్నారు.
‘క్విట్ పెయిన్’ 9 రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని దక్కన్ హెల్త్‌కేర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మింటో పురుషోత్తం గుప్తా తెలిపారు. వెన్నునొప్పి, మెడ, మణికట్టు, చీలమండ, తుంటి, భుజం, మోకీలు, మోచేయి నొప్పులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందన్నారు. అలాగే, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, బెణకడం వంటి సమస్యల నుంచి కూడా ఇది తక్షణం ఉపశమనం కల్పిస్తుందన్నారు.
క్విట్ పెయిన్ జెల్(QuitPain Gel)ను సహజ సిద్ధమైన పదార్థాలతో తయారుచేయడం వల్ల నొప్పులు, వాపు నుంచి దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తుందన్నారు. పురాతన ఆయుర్వేద విజ్ఞానం, సమకాలీన శాస్త్రీయ పరిశోధనలను అత్యుత్తమంగా మిళితం చేసి శక్తిమంతమైన ప్యాక్డ్ జెల్‌లా అందిస్తున్నట్టు డాక్టర్ మింటో పురుషోత్తం తెలిపారు.
Updated Date - 2023-01-06T20:54:56+05:30 IST