నాలుగేళ్లలో ఇనుప ఖనిజేతర ఆదాయం 15%: ఎన్‌ఎండీసీ
ABN, Publish Date - Dec 14 , 2023 | 04:56 AM
వచ్చే నాలుగేళ్ల నాటికి (2027-28) బంగారం, బొగ్గు, లిథియం వంటి ఇనుప ఖనిజేత విభాగాల నుంచి 15 శాతం ఆదాయం రాగలదని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వచ్చే నాలుగేళ్ల నాటికి (2027-28) బంగారం, బొగ్గు, లిథియం వంటి ఇనుప ఖనిజేత విభాగాల నుంచి 15 శాతం ఆదాయం రాగలదని ఎన్‌ఎండీసీ అంచనా వేస్తోంది. ఇనుప ఖనిజేతర లోహాల్లోకి ప్రవేశించే వ్యూహంలో భాగంగా జార్ఖండ్‌లో రెండు బొగ్గు క్షేత్రాలను ఎన్‌ఎండీసీ సొంతం చేసుకుంది. ఇందులోని ఒక క్షేత్రంలో వచ్చే ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో ఉత్పత్తిని చేపట్టే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే ఒక బంగారం గనిలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. వచ్చే కొద్ది కాలంలో ఏడు నుంచి పది బంగా రం గనులు ఎన్‌ఎండీసీ చేతిలో ఉండనున్నాయి. ఆస్ట్రేలియాలో లిథియం అన్వేషణ, మైనింగ్‌కు ఇప్పటికే ఆస్ట్రేలియాలోని మైనింగ్ కంపెనీ హ్యాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్‌ను నియమించింది.
Updated Date - Dec 14 , 2023 | 04:56 AM