ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పని వేళల్లో కాసేపు కునుకు అవసరమే..

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:16 AM

పనివేళల్లో చిన్న నిద్ర బ్రేక్‌ అవసరమని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. కాసేపు కునుకు తీయడం ద్వారా అలసట దూరమవడంతోపాటు...

మెజారిటీ ఉద్యోగుల మనోగతమిదే..

జీనియస్‌ కన్సల్టెంట్‌ సర్వేలో వెల్లడి

ముంబై: పనివేళల్లో చిన్న నిద్ర బ్రేక్‌ అవసరమని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. కాసేపు కునుకు తీయడం ద్వారా అలసట దూరమవడంతోపాటు పని సామర్థ్యం పెంపునకు, ఆరోగ్య శ్రేయస్సుకు ఇది దోహదపడుతుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. మానవ వనరులను సమకూర్చే సంస్థ జీనియస్‌ కన్సల్టెంట్స్‌ ఈ నివేదికను విడుదల చేసింది. ‘‘జపాన్‌లో పనిచేసే చోటే కాసేపు నిద్ర పోయే సంప్రదాయం చాలాకాలంగా కొనసాగుతోంది. ఆరోగ్యకరమైన పని సంస్కృతికిది కీలకమ’’ని సంస్థ అంటోంది. ఈ ఏడాది సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 27 మధ్య కాలంలో ఆయా రంగాల్లో పని చేస్తున్న 1,207 మంది ఉద్యోగులను సర్వే చేసినట్లు తెలిపింది. అందులో 94 శాతం మంది చిన్న నిద్ర బ్రేక్‌ కీలకమని అభిప్రాయపడ్డారు. కేవలం 3 శాతమే ఈ భావనతో విబేధించినట్లు రిపోర్టు వెల్లడించింది. మరిన్ని వివరాలు..

  • కాసేపు కునుకు తీయడం ద్వారా పని సామర్థ్యం పెరుగుతుందని 82 శాతం అభిప్రాయపడగా.. 12 శాతం విబేధించారు.

  • పని సమయంలో అధిక ఆయాసం, అలసటకు గురైనట్లు 60 శాతం వెల్లడించగా.. 27 శాతం మంది తమకలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదన్నారు.

  • పని వేళల్లో గంట సేపు నిద్ర బ్రేక్‌కు అనుమతిస్తే, పని గంటలను మరో గంట పెంచడం తమకు సమ్మతమేనని సర్వేలో పాల్గొన్న 49 శాతం మంది పేర్కొనగా.. 36 శాతం మంది మాత్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

  • నిద్ర బ్రేక్‌ పనిలో సంతృప్తితోపాటు ఆరోగ్య శ్రేయస్సుకు తోడ్పడుతుందని 78 శాతం భావిస్తున్నారు. కాగా, వృత్తి-వ్యక్తిగత జీవన సమతుల్యానికి దోహదపడుతుందని 64 శాతానికి పైగా మంది అభిప్రాయపడ్డారు. 21 శాతం ఉద్యోగులు మాత్రం నిద్ర బ్రేక్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising