ఎకర్‌తో ఓటీఎ్‌సకు నాగార్జునా ఫెర్టిలైజర్స్ కసరత్తు
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:29 AM
అసెట్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఎకర్)తో వన్-టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎ్‌స)కు ఉన్న అవకాశాలను నాగార్జునా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్‌ఎ్‌ఫసీఎల్) పరిశీలిస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అసెట్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఎకర్)తో వన్-టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎ్‌స)కు ఉన్న అవకాశాలను నాగార్జునా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్‌ఎ్‌ఫసీఎల్) పరిశీలిస్తోంది. సర్ఫేసీ చట్టం కింద ఓటీఎ్‌సను కుదుర్చుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు ఎకర్‌తో కంపెనీ చర్చలు జరపడానికి ఎన్‌ఎ్‌ఫసీఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. సర్ఫేసీ చట్టం కింద ఎన్‌ఎ్‌ఫసీఎల్ రుణదాతల నుంచి కొద్ది నెలల క్రితం ఎకర్... ఎన్‌ఎ్‌ఫసీఎల్ మొండి బకాయిలను కొనుగోలు చేసింది. ఈ పరిణామం అనంతరం మూడు నెలలకు గ్రీన్‌కో గ్రూప్‌నకు చెందిన ఏఎం గ్రీన్ అమ్మోనియాకు యూరియా, మైక్రో ఇరిగేషన్ వ్యాపారాన్ని రూ.1,700 కోట్లకు స్లంప్ సేల్ ప్రాతిపదికన విక్రయించి మొండి బకాయిలను తిరిగి చెల్లించాలని ఎన్‌ఎ్‌ఫసీఎల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో స్లంప్ సేల్ ప్రాతిపదికన ఆస్తులను గ్రీన్‌కో గ్రూప్ కంపెనీకి విక్రయించే అంశంతో పాటు ఎకర్‌తో వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ను కుదుర్చుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని బోర్డు మీటింగ్‌లో నిర్ణయించింది. ఓటీఎస్ ద్వారా అటు ఎకర్‌కు, ఇటు కంపెనీకి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఎన్‌ఎ్‌ఫసీఎల్ భావిస్తోంది. అయితే.. ఓటీఎస్ నియమనిబంధనలకు అనుగుణంగా లేదని అందువల్ల దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతానికి పరిశీలించలేమని ఎకర్ వెల్లడించినట్లు ఎన్‌ఎ్‌ఫసీఎల్ పేర్కొంది. సర్ఫేసీ చట్టం కింద ఎన్‌ఎ్‌ఫసీఎల్‌కు గతంలో నోటీసులు జారీ చేసిన ఎకర్.. కొన్ని ఆస్తులను ఈ ఏడాది అక్టోబరు 12న తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు ఎన్‌ఎ్‌ఫసీఎల్ కృషి చేస్తోంది.
Updated Date - Dec 26 , 2023 | 03:29 AM