ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముత్తూట్‌ వివాహసన్మానం ప్రాజెక్ట్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:05 AM

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌)లో భాగంగా ముత్తూట్‌ వివాహసన్మానం ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా...

హైదరాబాద్‌: ముత్తూట్‌ ఫైనాన్స్‌.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌)లో భాగంగా ముత్తూట్‌ వివాహసన్మానం ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా వితంతువులైన తల్లులకు తమ కుమార్తెల వివాహం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌ అందించనుంది. ఆర్థిక సాయం అందుకోవాలనుకునే వారు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మధురై, మంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాల నుంచి లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్లు ముత్తూట్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ఈ వివాహసన్మానం ప్రాజెక్ట్‌ కోసం మొత్తం రూ.40 లక్షలను కేటాయించినట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. 2024 జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య కాలంలో జరిగే వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆర్థిక సాయం పొందాలనుకునే వారి నెలవారీ ఆదాయం రూ.10,000 కంటే తక్కువగా ఉండాలని తెలిపింది. అర్హత కలిగిన అమ్మాయిల తల్లులు..అవసరమైన డాక్యుమెంట్స్‌తో హైదరాబాద్‌, హిమాయత్‌నగర్‌లోని మేనేజర్‌ (సీఎ్‌సఆర్‌), ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, జోనల్‌ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపింది.

Updated Date - Dec 17 , 2023 | 01:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising