ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Facebook: ఫేస్‌బుక్‌లో మరో రౌండ్ తొలగింపుల టెన్షన్.. ఈసారి టార్గెట్ వీరేనా..

ABN, First Publish Date - 2023-01-30T21:36:38+05:30

ఫేస్‌బుక్‌లో మరోమారు తొలగింపులు తప్పవనేలా సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక సంకేతాలిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టెక్ రంగంలో తొలగింపుల పర్వం ఉద్యోగుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో తెలీక సిబ్బంది వణికిపోతున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్‌లో మరోమారు తొలగింపులు తప్పవనేలా సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్(Zuckerberg) కీలక సంకేతాలిచ్చారు. సంస్థల్లో వివిధ స్థాయిల్లో మేనేజర్లు ఉండటాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘ఉద్యోగులను పర్యవేక్షించేందుకు ఓ మేనేజర్, ఆ మేనేజర్లను పర్యవేక్షించేందుకు మరికొంత మంది మేనేజర్లు, ఆపైస్థాయిలో ఇంకొంతమంది మేనేజర్లు.. ఇలాంటి వ్యవస్థ అవసరం లేదు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో..ఫేస్‌బుక్‌లో త్వరలో ఉన్నతస్థాయి ఉద్యోగుల తొలగింపు ఉంటుందన్న వాదనలు బయలుదేరాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేథ ఆధారిత చాట్‌‌జీపీటీపై(ChatGPT) కూడా మార్క్ జుకర్‌బర్గ్ పలు వ్యాఖ్యలు చేశారు. మేనేజర్లకు కోడింగ్‌లో సహాయకారిగా ఉండేందుకు చాట్‌జీపీటీ లాంటిది అభివృద్ధి చేయడంపై చర్చించారు. కాగా.. ఫేస్‌బుక్‌‌వైపు మరింతమంది కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించే దిశగా బజ్‌ఫీడ్ అనే ఇంటర్నెట్ మీడియా కంపెనీకి ఆ సంస్థ భారీగా డబ్బు చెల్లించిందని అక్కడి మీడియా పేర్కొంది. గతేడాది ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా 13 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ చరిత్రలో ఈ స్థాయిలో తొలగింపులు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-01-30T21:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising