ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎల్‌ఐసీ గ్యారెంటీ రిటర్న్‌ పాలసీ జీవన్‌ ఉత్సవ్‌

ABN, First Publish Date - 2023-11-30T02:37:57+05:30

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) బుధవారం కొత్త పాలసీని ప్రారంభించింది. జీవన్‌ ఉత్సవ్‌ పేరుతో...

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) బుధవారం కొత్త పాలసీని ప్రారంభించింది. జీవన్‌ ఉత్సవ్‌ పేరుతో గ్యారెంటీ రిటర్న్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌ సేవింగ్స్‌, హోల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకమని ఎల్‌ఐసీ వెల్లడించింది. 90 రోజుల నుంచి 65 ఏళ్ల వయసున్న వారు ఈ పథకాన్ని తీసుకోవచ్చని తెలిపింది. కనీస ప్రీమియం చెల్లింపు టర్మ్‌ ఐదేళ్లు. గరిష్ఠం 16 ఏళ్లు. ప్రీమియం చెల్లించే కాలంలో, ప్రతి యేటా చివర్లో బేసిక్‌ సమ్‌ అస్యూర్డ్‌లో ప్రతి రూ.1000కి రూ.40 చొప్పున గ్యారెంటీ జోడింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం చెల్లింపు టర్మ్‌ ముగిశాక పాలసీదారు రెగ్యులర్‌ ఇన్‌కమ్‌, ఫ్లెక్సీ ఇన్‌కమ్‌ బెనిఫిట్‌లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుంది. రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ ఆప్షన్‌లో.. 3 నుంచి 6 ఏళ్ల డిఫర్‌మెంట్‌ పీరియడ్‌ తర్వాత ప్రతి పాలసీ ఏడాది చివర్లో బేసిక్‌ సమ్‌ అస్యూర్డ్‌లో 10 శాతాన్ని చెల్లించడం జరుగుతుందని కంపెనీ తెలిపింది.

ఫ్లెక్సీ ఇన్‌కమ్‌ బెనిఫిట్‌ ఆప్షన్‌ ను ఎంచుకున్నవారు ఏటా చెల్లించే బేసిక్‌ సమ్‌ అస్యూర్డ్‌లో 10 శాతాన్ని పోగేసుకుని, ఆ తర్వాత కాలంలో (షరతులకు లోబడి) విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలా పోగేసుకున్న సొమ్ముపై 5.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అంతేకాదు, ఈ పథకంలో రుణ సౌలభ్యంతో పాటు పాలసీ కాలపరిమితి ముగియక ముందే సొమ్ము ఉపసంహరించుకునే వెసులుబాటును సైతం కల్పిస్తున్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్‌ సిద్ధార్థ మొహంతి తెలిపారు.

Updated Date - 2023-11-30T02:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising