ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆటుపోట్లలోనే..!

ABN, First Publish Date - 2023-10-30T02:04:48+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కూడా ఆటుపోట్లల్లోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగిసే వరకు మార్కెట్లో అనిశ్చితి కొనసాగనుంది. ముడి చమురు ధరలు, కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు...

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కూడా ఆటుపోట్లల్లోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగిసే వరకు మార్కెట్లో అనిశ్చితి కొనసాగనుంది. ముడి చమురు ధరలు, కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు సూచీల గమనాన్ని నిర్దేశించే వీలుంది. నిఫ్టీ 19,100 వద్ద కన్సాలిడేట్‌ అయితేనే బుల్లి్‌షనెస్‌ వస్తుంది. కొన్ని రోజులు ఇదే స్థాయిలో నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగించే అవకాశం ఉంటుంది.

యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతుండటంతో విదేశీ సంస్థాగత మదుపరుదారులు తమ పెట్టుబడులను పెద్దఎత్తున ఉపసంహరించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆకర్షణీయమైన ధరల్లో లభించే పటిష్ఠ కంపెనీల షేర్లను కొనుగోలు చేయటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

కెనరా బ్యాంక్‌: మార్కెట్‌ అంచనాలకు తగ్గట్టుగా ఆర్థిక ఫలితాలు ఉండటంతో ఈ కౌంటర్‌లో వాల్యూమ్స్‌ పెరిగాయి. గత వారం చివరి రెండు సెషన్లలో ఈ షేరు ఏకంగా 13 శాతం పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.380.70 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.280 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.410-465 టార్గెట్‌ ధరతో ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.365 స్థాయిని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ కార్డ్‌: జూలై నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తోంది. ఈ కౌంటర్‌లో విపరీతమైన అమ్మకాలతో బేస్‌ ఏర్పడుతోంది. మరోవైపు ఆర్థిక ఫలితా లు విడుదల కావటంతో ఈ కౌంటర్‌లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.796.50 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ షేరును రూ.790 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.825-880 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.770 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఆల్కెమ్‌ లేబొరేటరీస్‌: జూన్‌ త్రైమాసిక ఫలితాలు విడుదలైన్పటి నుంచి ఈ షేరు నష్టాల బాటలోనే సాగు తూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల తేదీ సమీపిస్తుండటంతో ఈ షేరులో మూమెంటమ్‌ కనిపిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.3,687 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.3,650 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.3,730-3,820 టార్గెట్‌ ధరతో ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,610 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హెచ్‌సీఎల్‌ టెక్‌: ఐటీ రంగం స్తబ్దుగా ఉన్నప్పటికీ ఈ షేరుపై ఇన్వెస్టర్ల అంచనాలు ఏ మాత్రం తగ్గటం లేదు. రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం, డివిడెండ్‌ తేదీ సమీపిస్తుంటంతో చివరి రెండు సెషన్లలో వాల్యూమ్‌ పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,267.50 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ షేరును రూ.1,260 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.1,320-1,390 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,240 స్థాయిని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

శ్రీరామ్‌ ఫైనాన్స్‌: నిఫ్టీతో పోలిస్తే ఈ కౌంటర్‌ మెరుగైన పనితీరును కనబరుస్తోంది. మార్కెట్‌ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు ఉండటం, డివిడెండ్‌ ప్రకటించటంతో గత శుక్రవారం మంచి లాభంతో రూ.1,937.60 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.1,900 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.1,965-2,100 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,860 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

-మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు,

నిఫ్ట్‌ మాస్టర్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2023-10-30T02:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising