Heavy bonus: 4 ఏళ్ల శాలరీని బోనస్‌గా ప్రకటించిన కంపెనీ..
ABN, First Publish Date - 2023-01-09T22:11:44+05:30
తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్ప్’ (Evergreen Marine Corp) ఏడాది ముగింపు సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది.
తైపీ సిటీ: తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్ప్’ (Evergreen Marine Corp) ఏడాది ముగింపు సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు భారీ బోనాంజా ప్రకటించింది. సగటున 50 నెలల వేతనం లేదా 4 ఏళ్లకుపైగా చెల్లింపునకు సమానమైన బోనస్ (Bonus) ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉద్యోగం గ్రేడ్, బాధ్యతలను బట్టి బోనస్ చెల్లింపులో వ్యత్యాలు ఉంటాయని తెలిపింది. అయితే తైవాన్ (Taiwan) కేంద్రంగా కొనసాగుతున్న కాంట్రాక్టుల్లో పనిచేసే సిబ్బందికి మాత్రమే బోనస్ వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
ఏడాది ముగింపు బోనస్‌లు ఎల్లప్పుడూ కంపెనీ ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. ఉద్యోగుల ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకోనున్నారని ఎవర్‌గ్రీన్ మెరైన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా గత రెండేళ్ల కరోనా ప్రభావం తర్వాత షిప్పింగ్ ఇండస్ట్రీ పుంజుకోవడం ఎవర్‌గ్రీన్‌కు కలిసొచ్చింది. కన్స్యూమర్ గూడ్స్, రవాణా రేట్లు కంపెనీకి అనూహ్య ఫలితాలను తెచ్చిపెట్టింది. 2022లో కంపెనీ ఆదాయం 2020తో పోల్చితే రికార్డ్ స్థాయిలో దాదాపు 3 రెట్లు పెరిగి 634.6 బిలియన్ల ఎన్‌టీ డాలర్లుగా (New Taiwan dolla) (20.7 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది.
Updated Date - 2023-01-09T22:11:46+05:30 IST