20,400 వద్ద కన్సాలిడేషన్కు చాన్స్..!
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:25 AM
సువెన్ ఫార్మా: సుదీర్ఘ కాలం కన్సాలిడేషన్ తర్వాత ఈ షేరు అప్ట్రెండ్లో కొనసాగుతోంది. షేరు ధర తగ్గినప్పుడల్లా మదుపరులు కొనుగోళ్లు పెంచుకుంటూ పోతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. సూచీలు ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలకు చేరుకోవటంతో పాటు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటం, లాభాల స్వీకరణకు అవకాశాలు ఉండటమే ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ఏడు వారాలుగా ఏకధాటిగా లాభాల బాటలో సాగుతూ వస్తున్న నిఫ్టీ, సెన్సెక్స్కు గత వారం బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో కరెక్షన్, కన్సాలిడేషన్కు అవకాశం ఉంది. నిఫ్టీకి తక్షణ మద్దతు 21,200, ఆ తర్వాత 20,400 వద్ద ఉంది. ఒకవేళ సూచీ ఈ స్థాయికి వస్తే 19,700 వరకు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలున్నాయి. సానుకూల పరిస్థితుల్లో ర్యాలీ కొనసాగితే మాత్రం 21,800కు చేరుకునే అవకాశం ఉంది.
స్టాక్ రికమండేషన్స్
సువెన్ ఫార్మా: సుదీర్ఘ కాలం కన్సాలిడేషన్ తర్వాత ఈ షేరు అప్ట్రెండ్లో కొనసాగుతోంది. షేరు ధర తగ్గినప్పుడల్లా మదుపరులు కొనుగోళ్లు పెంచుకుంటూ పోతున్నారు. చివరి రెండు సెషన్లలో ఈ షేరు 11 శాతం మేర లాభపడింది. గత శుక్రవారం ఈ షేరు రూ.712 వద్ద ముగిసింది. ట్రేడర్లు ఈ షేరును రూ.700/720 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.840 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.685 స్థాయిని స్టాప్లా్సగా పెట్టుకోవాలి.
థెర్మాక్స్ లిమిటెడ్: డిసెంబరు నెల ఆరంభం నుంచి ఈ కౌంటర్లో మూమెంటమ్ పెరిగింది. రాబోయే త్రైమాసికంలో లాభదాయకత మెరుగ్గా ఉంటుందన్న అంచనాలు. పాజిటివ్ రేటింగ్స్తో ఈ షేరు పుంజుకుంది. చివరి ఎనిమిది సెషన్లలోనే ఈ షేరు రూ.500 మేర పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.3,143 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ కౌంటర్లో రూ.3,100/3,120 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.3,450/3,555 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,060 స్థాయిని స్టాప్లా్సగా పెట్టుకోవాలి.
సన్ టీవీ నెట్వర్క్: గత రెండు త్రైమాసికాల నుంచి ఈ కౌంటర్లో మంచి మూమెంటమ్ కనిపిస్తోంది. ఒడుదొడుకులు లేకుండా అప్ట్రెండ్లో సాగుతోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.723 వద్ద క్లోజైంది.
ట్రేడర్లు ఈ కౌంటర్లో రూ.700/720 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.780/870 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.675 స్థాయిని స్టాప్లా్సగా పెట్టుకోవాలి.
జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా: ఏడాది కాలంగా ఈ షేరు అప్ట్రెండ్ను కొనసాగిస్తూ వస్తోంది. షేరు విభజన అనంతరం కొంతకాలం ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం మూమెంటమ్ పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,500 నిరోధ స్థాయిని అధిగమించి రూ.1,620 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.1,600/1,570 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.1,860 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,550 స్థాయిని స్టాప్లా్సగా పెట్టుకోవాలి.
గెయిల్ ఇండియా: ఈ షేరు గడచిన ఆరు నెలలుగా అప్ట్రెండ్లో కొనసాగుతోంది. నవంబరు చివరి వారం నుంచి డెలివరీ, ట్రేడింగ్ వాల్యూమ్ భారీగా పెరుగుతూ వస్తోంది. చివరి రెండు సెషన్లలో ఈ షేరు 13 శాతం పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.151.50 వద్ద క్లోజైన ఈ షేరులో ట్రేడర్లు రూ.148/150 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.165/190 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.145 స్థాయిని స్టాప్లా్సగా పెట్టుకోవాలి.
Updated Date - Dec 26 , 2023 | 03:25 AM