అప్రమత్తంగా ఉండటం బెటర్..!
ABN, Publish Date - Dec 18 , 2023 | 01:24 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ కొత్త ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలివ్వటం మార్కెట్ వర్గాల్లో...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ కొత్త ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలివ్వటం మార్కెట్ వర్గాల్లో సంతోషాన్ని నింపింది. డాలర్ ఇండెక్స్ సైతం తగ్గటంతో ఐటీ కంపెనీల షేర్లు జోరందుకున్నాయి. కేవలం రెండు సెషన్లలోనే ఐటీ సూచీ 10 శాతం మేర పెరిగింది. సెన్సెక్స్, నిఫ్టీ గరిష్ఠాలకు చేరినా ఫియర్ ఇండెక్స్ విక్స్ తగ్గుతుండటం సానుకూల సంకేతం. మార్కెట్లు వరుసగా ఏడు వారాలుగా పెరుగుతూ వస్తుండటంతో షేర్ల ఎంపికలో మదుపరులు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ ఫ్యూచర్స్ డిసెంబరు మద్దతు, నిరోధ స్థాయిలు వరుసగా 21,440, 21,600 పాయింట్ల వద్ద ఉన్నాయి.
స్టాక్ రికమండేషన్స్
టెక్ మహీంద్రా: ద్వితీయ త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ కౌంటర్‌లో మూమెంటమ్ పెరిగింది. రెండు వారాలుగా కన్సాలిడేట్ అవుతూ వస్తున్న ఈ షేరు చివరి రెండు సెషన్లలో 10 శాతం మేర లాభపడింది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,306 వద్ద ముగిసింది. ట్రేడర్లు ఈ షేరును రూ.1,300/1,280 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.1,375/1,540 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,250 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఫైజర్ లిమిటెడ్: కొన్నాళ్లుగా ఈ షేరు ఒకే స్థాయిలో కన్సాలిడేట్ అవుతూ వస్తోంది. టెక్నికల్ చార్టులో హయ్యర్ హై ఫామ్ చేస్తోంది. చివరి రెండు సెషన్లలో షేరు ధర బాగా పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.4,199 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.4,200/4,160 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.4,550 టార్గెట్ ధరతో ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,140 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
సన్ టీవీ నెట్‌వర్క్: జూన్ నుంచి ఈ స్ర్కిప్ అప్‌ట్రెండ్‌ను కనబరుస్తూ వస్తోంది. ద్వితీయ త్రైమాసిక ఫలితాలు బాగుండటంతో పాటు డివిడెండ్ ప్రకటించటంతో మూమెంటమ్ పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.695 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.680/650 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.765/820 టార్గెట్ ధరతో ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.630 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మెక్‌డోవెల్: హాలీడే సీజన్ రావటంతో మద్యం విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. కొన్నాళ్లుగా ఈ కౌంటర్ నిలకడగా పెరుగుతూ వస్తోంది. గత శుక్రవారం రూ.1,083 స్థాయిల్లో క్లోజైన ఈ షేరును.. ట్రేడర్లు రూ.1,050 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.1,140/1,220 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,020 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
రూట్ మొబైల్స్: జూలై నెల తర్వాత ఈ షేరు రూ.1,500 స్థాయిల్లో సుదీర్ఘకాలం పాటు కన్సాలిడేట్ అయ్యింది. ఈ కౌంటర్‌లో ఇప్పుడిప్పుడే అప్‌ట్రెండ్ కనిపిస్తోంది. రెండు వారాలుగా ఈ కౌంటర్‌లో డెలివరీ, ట్రేడింగ్ పరిమాణం పెరుగుతోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,613 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.1,600 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.1,740/1,855 టార్గెట్ ధరతో ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,570 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్ట్ మాస్టర్
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
Updated Date - Dec 18 , 2023 | 01:24 AM